ఈ ప్రముఖ నటి కన్నీటి కష్టాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న కంటెస్టెంట్లలో అర్చనా గౌతమ్ ఒకరు. బిగ్ బాస్ సీజన్ 16 హిందీ కంటెస్టెంట్లలో ఒకరైన అర్చనా గౌతమ్ సినిమాల్లోకి రాకముందు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ నటి తన కన్నీటి కష్టాలకు సంబంధించిన షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. బాల్యంలో మా కుటుంబాన్ని ఆర్థిక కష్టాలు వెంటాడాయని ఆమె అన్నారు. నేను కూడా ఏదో ఒక పని చేసేదానినని అర్చన గౌతమ్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

15 సంవత్సరాల క్రితం ఖాళీ సిలిండర్లను సైకిల్ పై లేదా స్కూటీపై తీసుకెళ్లేదానినని ఆమె చెప్పుకొచ్చారు. అలా పని చేయడం వల్ల నాకు 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ఇచ్చేవారని అర్చన అన్నారు. నేను మొదట టెలీకాలర్ గా ఉద్యోగం చేశానని అర్చనా గౌతమ్ చెప్పుకొచ్చారు. తాను టెలీ కాలర్ గా పని చేసే సమయంలో నెలకు 6,000 రూపాయల వేతనం ఇచ్చేవారని ఆమె కామెంట్లు చేశారు.

నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదని ఈ రీజన్ వల్ల నేను టెలీ కాలర్ జాబ్ ను కూడా కోల్పోయానని అర్చన అన్నారు. ఆ తర్వాత ఏదో ఒక పని చేస్తూ జీవనం సాగించానని అర్చన తెలిపారు. నేను ఒక కంపెనీలో చేరగా ఆ కంపెనీ మూతపడిందని అలా జరగడంతో నేను సొంతూరికి వెళ్లిపోయానని అర్చనా గౌతమ్ వెల్లడించారు. తర్వాత రోజుల్లో అర్చనా గౌతమ్ పలు అందాల పోటీలలో పాల్గొన్నారు. మిస్ ఇండియా, మిస్ ఉత్తరప్రదేశ్, మిస్ బికినీ యూనివర్స్ పోటీలలో పాల్గొన్న అర్చనా గౌతమ్ ఆ పోటీలలో రాణించి సత్తా చాటారు.

బిగ్ బాస్ షో టాప్5 ఫైనలిస్ట్ లలో ఈమె కూడా ఒకరు కావడం గమనార్హం. అర్చనా గౌతమ్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అర్చనా గౌతమ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus