Simran: నటి సిమ్రాన్ ఇప్పుడెలా ఉందో చూశారా.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

సిమ్రాన్.. మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. తమిళ్, తెలుగు ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి.. దాదాపు దశాబ్దానికి పైగా ఓ ఊపు ఊపింది.. తక్కువ టైంలోనే తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో మూవీస్ చేసిన పాన్ ఇండియా యాక్ట్రెస్ సిమ్రాన్.. దాదాపు స్టార్ హీరోలందరితోనూ ఆమె ఆడి పాడింది.. తెలుగులో మహానటి సావిత్రి తర్వాత సౌందర్య ఎలాగో.. ఆమె తర్వాత అంతటి ప్రేక్షకాదరణ పొందుకుంది.. అందం, అభినయంతో పాటు సిమ్రాన్ సూపర్బ్ డ్యాన్సర్ కూడా..

స్క్రీన్ మీద డ్యాన్స్ చేస్తుంటే చూడ ముచ్చటగా ఉంటుంది..కెరీర్ పీక్స్‌లో ఉండగానే.. చిన్ననాటి స్నేహితుడు దీపక్ బగ్గాను పెళ్లి చేసుకుంది.. వీరికి ఇద్దరు కొడుకులు.. టెలివిజన్‌లోనూ అలరించిన సిమ్రాన్.. తమిళంలో రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తుంది.. తెలుగులో 2008లో కృష్ణ భగవాన్ పక్కన నటించిన ‘జాన్ అప్పారావ్ 40 ప్లస్’ చివరి చిత్రం..

ఇన్‌స్టాగ్రామ్‌లో తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలన్నిటినీ షేర్ చేస్తుంటుందామె.. ‘47 ఏళ్ల వయసులోనూ గ్లామర్ చక్కగా మెయింటెన్ చేస్తున్నారు’ అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..

 

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus