తెలుగులో వరుస సినిమాలు చేసి.. మిస్ జడ్జిమెంట్ వల్ల సరైన విజయాలు అందుకోలేకపోయినా కథానాయిక శ్రీలీల(Sreeleela) . అయితే ఆమెకి ఇంకా ఆ అట్రాక్షన్ ఉంది. కారణం ఆమె లుక్స్, డ్యాన్స్. ఇలాంటి నాయిక బాలీవుడ్‌కి వెళ్తే రష్మిక మందనలా స్టార్ అవుతుంది అని అనుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. నిజానికి ఆమె టాలీవుడ్ వచ్చి రష్మిక (Rashmika Mandanna) పోటీగా నిలిచింది కూడా. ఈ విషయం పక్కన పెడితే బాలీవుడ్‌లో శ్రీలీల సినిమా ఏంటి అనేది దాదాపుగా తేలిపోయింది.
Sreeleela
‘తు మేరీ మై తేరా.. మై తేరా తు మేరీ’ అనే సినిమాను కథానాయకుడు కార్తిక్ ఆర్యన్ ఇటీవల అనౌన్స్ చేశాడు. అయితే అప్పుడు ఆ సినిమా ఏంటి అనే పూర్తి వివరాలను అప్పుడు చెప్పలేదు. సమీర్ విద్వాన్స్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమాలో హీరోయిన్‌గా మన లీలనే నటిస్తోంది అని సమాచారం అందుతోంది. కరణ్ జోహార్ నిర్మాతగా తెరకెక్కనున్న ఈ సినిమాను త్వరలో భారీ స్థాయిలో అనౌన్స్ చేస్తారట. అప్పుడు శ్రీలీల సంగతి కూడా తేలుతుంది అని అంటున్నారు.
కార్తిక్, శ్రీలీల జోడీగా బాలీవుడ్‌లో సరికొత్త ప్రేమకథను సిద్ధం చేసే ప్లాన్‌లో కరణ్ జోహార్ ఉన్నారు అని కార్తిక్ సన్నిహిత వర్గాలు బాలీవుడ్ మీడియాకు వెల్లడించాయట. రీసెంట్‌గా ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2: The Rule) సినిమాలో స్పెషల్ సాంగ్ ‘కిస్సిక్’తో అలరించిన శ్రీలీల చేతిలో ఇప్పుడు రెండు తెలుగు సినిమాలు, ఒక తమిళ సినిమా ఉంది. బాలీవుడ్ సినిమా కూడా యాడ్ అయితే నెక్స్ట్ పాన్ ఇండియా హీరోయిన్ ఈమెనే అవుతుంది.
ఆమె సినిమాల సంగతి చూస్తే.. రవితేజతో (Ravi Teja) ‘మాస్ జాతర’ (Mass Jathara) అనే సినిమా చేస్తోంది. అలాగే పవన్ కల్యాణ్‌తో (Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) అనే సినిమాలో నటిస్తోంది. నితిన్‌తో (Nithiin) నటించిన ‘రాబిన్ హుడ్’ (Robinhood)సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇవి కాకుండా శివ కార్తికేయన్ (Sivakarthikeyan) – సుధ కొంగర కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త సినిమా ‘1965’ (వర్కింగ్ టైటిల్)లో కూడా శ్రీలీలనే తీసుకున్నారు అని టాక్.