కామెడీ స్టార్స్ తో కొత్త ప్రోగ్రామ్..!

బుల్లితెరపై శ్రీదేవి మరోసారి హల్ చల్ చేయబోతోంది. లాస్ట్ టైమ్ డ్యాన్స్ షోకి జడ్జిగా వచ్చి అందర్నీ అలరించిన ఈ అందాల భామ ఇప్పుడు కామెడీస్టార్స్ లో జడ్జిగా రాబోతోంది. శేఖర్ మాస్టర్ తో కలిసి చిన్న స్క్రీన్ ని షేర్ చేసుకుంటోంది. స్టార్ మా రీసంట్ గా రిలీజ్ చేసిన ప్రోమోలో శ్రీదేవి తనదైన స్టైల్లో హల్ చల్ చేస్తోంది. స్టేజ్ పైన స్టెప్పులేస్తూ ఇరగదీసింది.

ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. ఓంకార్ ఎట్రాక్షన్ గా స్టార్ట్ అయిన ఈ ప్రోమో లో షోకి యాంకర్ ని గెస్ట్ లని పరిచయం చేశారు. అంతేకాదు, ఈ షో ఎలా ఉండబోతోంది అని కూడా చూపించారు. ఎనర్జిటిక్ యాంకర్ గా వర్షిణి, తర్వాత అవినాష్ చేసిన ఫన్ ప్రోమోలో హైలెట్ అనే చెప్పాలి. చూడటానికి జబర్ధస్త్ కాన్సెప్ట్ లాగానే ఉన్నా, డ్యాన్స్ ని కూడా మిక్స్ చేస్తూ కొంతమంది కొత్త కమెడియన్స్ ని పరిచయం చేశారు.

చమ్మక్ చంద్ర చమ్మక్కులు, అవినాష్ పంచ్ లు, శేఖర్ మాస్టర్ డ్యాన్స్ తో ప్రోమో ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ ప్రోగ్రామ్ ప్రతి ఆదివారం మద్యాహ్నం టెలికాస్ట్ కాబోతోంది. మరికెందుకు ఆలస్యం ప్రోమోని మీరు కూడా ఒక లుక్కేయండి.


ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus