నాని హీరోగా రూపొందిన ‘ఆహా కళ్యాణం’ చిత్రం (‘బ్యాండ్ బజావో భారత్’ రీమేక్) ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది వాణీ కపూర్. ఈ మూవీలో అందంతో, అభినయంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ.సినిమా ప్లాప్ కావడంతో తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదు. అడపా దడపా బాలీవుడ్లోనే సినిమాలు చేసుకుంటుంది. తెలుగులో బాలయ్య సరసన నటించే ఛాన్స్ వస్తే ఈమె రిజెక్ట్ చేసింది. అఖండ చిత్రానికి ఈమెను హీరోయిన్ గా అనుకున్నారు.
కానీ ఈమె (Vaani Kapoor) వద్దనుకుంది.ఆ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. దీంతో ఈమె మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నట్టైంది. ఒకవేళ ఈమె ఆ సినిమాలో నటించి ఉంటే.. వేరే సినిమాలో ఛాన్స్ దొరికే అవకాశం ఉండేది.కానీ ఇప్పుడు ఆమెకు ఆఫర్లు లేవు. ఇప్పటికీ ఈమె టాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది.మరో పక్క సోషల్ మీడియాలో విచ్చల విడిగా అందాలు ఆరబోస్తుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :