‘భీమ్లా నాయక్’ నుండీ మరో ఆకట్టుకునే పాట..!

పవన్ కళ్యాణ్- రానా దగ్గుబాటి కాంబినేషన్లో మలయాళం సూపర్ హిట్ చిత్రమైన ‘అయ్యప్పన్ కోషియమ్’… ‘భీమ్లా నాయక్’ గా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సంభాషణలు సమకూరుస్తున్నాడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది.

కాగా ఇప్పటికే విడుదలైన టీజర్లు, మూడు పాటలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. తాజాగా భీమ్లా నాయక్ నుండీ ఫోర్త్ సింగిల్ సాంగ్ గా ‘అడవి తల్లి మాట’ అనే పాట విడుదలైంది. నవంబర్ 30నే ఈ పాటని విడుదల చెయ్యాలి అనుకున్నారు కానీ ప్రఖ్యాత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించడంతో వాయిదా వేశారు.ఇక ఈ పాట విషయానికి వస్తే..’అడవి తల్లి మాట’ అంటూ సాగే ఈ పాట ‘కిందున్న మడుసులక కోపాలు తేవలవు.. పైనున్న సామేమో కిమ్మని పలకడు’ అనే లిరిక్స్ తో మొదలైంది.

కుమ్మరి దుర్గవ్వ, సాహితీ చాగంటి ఈ పాటని చాలా బాగా పాడారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకి లిరిక్స్ అందించగా తమన్ అందించిన ట్యూన్ కూడా బాగా కుదురిందనే చెప్పాలి. ‘సెపుతున్న నీ మంచి సెడ్డా, అంతోటి పంతాలు పోబాకు బిడ్డా..’ అనే లిరిక్ దగ్గర ఆటను ఇచ్చిన హై బాగుంది. పాట చాలా అగ్రెసివ్ గా అలాగే బోలెడన్ని ఎమోషన్లని క్యారీ చేసే విధంగా ఉంది. మీరు కూడా ఓ సారి వినెయ్యండి :

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!


‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Share.