Adi Reddy Eliminated: డబుల్ ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఇదేనా..! టాప్ – 5 లో ఎవరుంటారంటే.?

బిగ్ బాస్ హౌస్ లో ఆసక్తికరమైన ఎలిమినేషన్ కి తెరలేచిందా అంటే నిజమే అంటున్నారు ఆడియన్స్. సోషల్ మీడియాలో వినిపిస్తున్న, అన్ అఫీషియల్ పోల్స్ లో కనిపిస్తున్న ఓటింగ్ ప్రకారం చూస్తే ఈవారం ఆదిరెడ్డి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.ప్రస్తుతం రేట్ టు ఫినాలేలో భాగంగా టిక్కెట్ టు ఫినాలే టాస్క్ నడుస్తోంది. ఇందులో ఆదిరెడ్డి అవు్ట్ అయినట్లుగా సమాచారం. ఫైనల్ గా ఈటాస్క్ లో ఫైమా, రోహిత్ తో పాటుగా ఆదిరెడ్డి కూడా తొలగిపోయాడు.

ఇక ఫ్రెండ్స్ అయిన శ్రీహాన్ – రేవంత్ ఇద్దరిలోనే ఈ టాస్క్ అనేది ఉండబోతోంది. ఈ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ వీరిద్దరికీ ఎలాంటి ఛాలెంజ్ ఇవ్వబోతున్నాడా అనేది ఆసక్తికరం. మరోవైపు ఓటింగ్ లో ఆదిరెడ్డి బాగా వెనకబడ్డాడు. సోషల్ మీడియాలో వివిధ రకాల వెబ్ సైట్స్. యూట్యూబ్ పోలింగ్ సైట్స్ ఆధారంగా చూస్తే ఈవారం ఫైమా ఓటింగ్ లో లీస్ట్ లో ఉంది. గతవారం కూడా ఫైమానే లీస్ట్ లో ఉందని అఫీషియల్ గా స్టేజ్ పైన చెప్పాడు నాగార్జున.

కానీ ఎవిక్షన్ ఫ్రీపాస్ వల్ల బ్రతికిపోయింది. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫైమా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక డబుల్ ఎలిమినేషన్ జరిగితే మాత్రం ఆదిరెడ్డి కూడా అవుట్ అవుతాడని, ఇదే ఈవారం బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ అని అంటున్నారు. ఈవారం డబుల్ ఎలిమినేషన్ జరిగితే అప్పుడు టాప్ 6 మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఇంకోవారం ఆట మిగిలి ఉంది కాబట్టి, ఆరుగురిలో ఎవరు ఉంటారా ? ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరం.

ప్రస్తుతం ఓటింగ్ ఆర్డర్ ని బట్టీ చూస్తే శ్రీసత్య కి పెద్దగా ఓటింగ్ పర్సెంటేజ్ లేదు. ఆఖరి వారం అందరూ నామినేషన్స్ లో ఉంటారు కాబట్టి, రేవంత్, రోహిత్, శ్రీహాన్, ఇనయ, కీర్తి ఈ ఐదుగురు కూడా సేఫ్ అయితే ఇప్పుడు శ్రీసత్య ఎలిమినేట్ అయిపోవాల్సి ఉంటుంది. అలా కాకుండా కీర్తి లీస్ట్ లో ఉంటే శ్రీసత్య ఫైనలిస్ట్ అవుతుంది. ఏది ఏమైనా ఈసారి టాప్ 5 ని బిగ్ బాస్ ముందుగానే డిసైడ్ చేశాడా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇక ఆదిరెడ్డి ఈవారం సేఫ్ అయితే మాత్రం ఖచ్చితంగా టాప్ – 5లోకి వెళ్లిపోతాడు. ఒకవేళ అఫీషియల్ పోలింగ్స్ లో ఆదిరెడ్డికి ఎక్కువ ఓటింగ్ జరిగితేనే సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. అన్ అఫీషియల్ లెక్కల ప్రకారం అయితే ఫైమా తర్వాత లీస్ట్ లో ఆదిరెడ్డి మాత్రమే ఉన్నాడు. కాబట్టి ఈవారం అవుట్ అవుతాడా.. లేదా నాటౌట్ గా టాప్ 5లో నిలబడతాడా అనేది చూడాలి. అదీ మేటర్.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus