Adi Reddy: ఈవారం ఎలిమినేషన్ లో బిగ్ బాస్ ఇచ్చే భారీ ట్విస్ట్ ఇదేనా..!

బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం నామినేషన్స్ లో మొత్తం 10మంది ఉన్నారు. వీళ్లలో ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో పోల్ అయిన ఓట్లని బట్టీ చూస్తే, ఈసారి డేంజర్ జోన్ లో చాలామందే ఉన్నారు. ఒక్కసారి మనం అన్ అఫీషియల్ ఓటింగ్ సైట్స్ లో ఏం జరిగిందనేది చూసినట్లయితే., ఓటింగ్ లో రేవంత్ ఎప్పటిలాగానే టాప్ లో ఉన్నాడు. రేవంత్ తన ఓట్ బ్యాంక్ ని కాపాడుకుంటూ వస్తున్నాడు. అయితే, ఈసారి రేవంత్ కి ధీటుగా బాలాదిత్య సెకండ్ పొజీషన్ లోకి వచ్చాడు.

శ్రీహాన్ నామినేషన్స్ లో లేకపోవడం అనేది బాలాదిత్యకి బాగా కలిసొచ్చింది. అందులోనూ సిగరెట్ ఇష్యూలో సింపతీ బాగా వర్కౌట్ అయ్యింది. దీంతో రెండో పొజీషన్ లో సేఫ్ గా ఉన్నాడు. తర్వాత ఇనయ సుల్తానా సేఫ్ జోన్ లోకి వచ్చింది. ఇనయ కూడా తన ఓట్ బ్యాంక్ ని ఈవారం బాగా పెంచుకుంది. సేఫ్ జోన్ లోకి వచ్చింది. ఆ తర్వాత కీర్తి కూడా సేఫ్ గానే ఉంది. కీర్తికి కూడా ఫస్ట్ నుంచీ ఒక గ్రూప్ ఓటింగ్ అనేది జరుగుతోంది. దాన్ని అలా కీర్తి కాపాడుకుంటోంది. సేఫ్ గానే ఉంది.

ఇక మిగిలిన ఆరుగురు చాలా డేంజర్ జోన్ లో ఉన్నారని చెప్పాలి. వీళ్లలో రోహిత్, ఫైమా, గీతు, మెరీనా, శ్రీసత్య ఇంకా ఆదిరెడ్డిలు ఉన్నారు. వీళ్లందరికీ ఇంచుమించు ఒకేరకమైన ఓటింగ్ అనేది పోల్ అవుతోంది. రోహిత్, ఫైమా ఈవారం గేమ్ లో పర్వాలేదనిపించారు. మిషన్ ఇంపాజబుల్ టాస్క్ లో శ్రీసత్య కూడా ఒక టాస్క్ లో విజయం సాధించింది. దీనివల్ల తనకి కూడా ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే, మెరీనా కూడా బేటన్ టాస్క్ లో పెర్ఫామన్స్ బాగా ఇచ్చింది. కాబట్టి , సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇక మిగిలింది గీతు ఇంకా ఆదిరెడ్డి మాత్రమే. వీరిద్దరిలోనే ఎలిమినేషన్ జరగబోతోందని అనిపిస్తోంది. ఒకవేళ గీతు సేఫ్ అయితే మాత్రం శ్రీసత్య ఎలిమినేషన్ లోకి వస్తుంది. అప్పుడు శ్రీసత్య ఇంకా ఆదిరెడ్డి వీరిద్దరిలోనే ఎలిమినేషన్ ప్రక్రియ జరిగితే హౌస్ నుంచీ ఎవరు వెళ్లిపోతారు అనేది ఆసక్తికరం. గీతు ఇంకా ఆదిరెడ్డి వీరిద్దరిలో ఒకరు వెళ్లిపోతారా ? లేదా శ్రీసత్య ఆదిరెడ్డి వీరిద్దరిలో ఒకరు వెళ్లిపోతారా అనేది ఉత్కంఠంగా మారింది.

ఈవారం ఎలిమినేషన్స్ లో ఖచ్చితంగా బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఒక మేల్ కంటెస్టంట్, ఒక ఫిమేల్ కంటెస్టెంట్ ఇద్దరూ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. మరి బిగ్ బాస్ ఇలాంటి భారీ ట్విస్ట్ ఇస్తే మాత్రం శ్రీసత్యకి కూడా ఎలిమినేషన్ గండం ఉన్నట్లే. ఇక ఇద్దరు రివ్యూవర్స్ లో ఒకరు హౌస్ నుంచీ వెళ్లిపోక తప్పదనే అంటున్నారు నెటిజన్స్. అదీ మేటర్.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus