గతేడాది అత్యంత భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిలైన సినిమాలలో ఆదిపురుష్ (Adipurush) సినిమా ఒకటి. ఈ సినిమా విషయంలో దర్శకుడు ఓం రౌత్ (Om Raut) పై వచ్చిన విమర్శలు అన్నీఇన్నీ కావు. ఆదిపురుష్ సినిమాలో బ్రహ్మ పాత్రలో కనిపించిన బిజయ్ ఆనంద్ ట్రోల్స్ గురించి స్పందిస్తూ సినిమా నచ్చకపోతే చూడటం మానేయాలని నటీనటులను విమర్శించడం రైట్ కాదని అన్నారు. ఒక సినిమాను తెరకెక్కించాలంటే అందులో ఎంత కష్టం ఉంటుందో అందరికీ తెలుసని ఆయన చెప్పుకొచ్చారు.
కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీయడం అంటే సాధారణమైన విషయం కాదని ఆయన కామెంట్లు చేశారు. నచ్చితే మాత్రమే సినిమా చూడాలని ఆయన తెలిపారు. కొంతమంది కళాకారులను భయపెట్టాలని చూస్తున్నారని బిజయ్ ఆనంద్ చెప్పుకొచ్చారు. దర్శకుడు ఓం రౌత్ ఎన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చినా ఏ మాత్రం భయపడలేదని ఆయన కామెంట్లు చేశారు. ఓం రౌత్ ట్రోల్స్ ను పట్టించుకోకుండా ధైర్యంగా ఉన్నారని బిజయ్ ఆనంద్ చెప్పుకొచ్చారు.
అందుకే ఓం రౌత్ అంటే చాలా ఇష్టమని ఆయన వెల్లడించారు. బడే మియాన్ చోటా మియాన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బిజయ్ ఆనంద్ ఈ కామెంట్లు చేశారు. అయితే ఈ కామెంట్ల విషయంలో నెటిజన్లు సైతం తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఎంతోమంది దర్శకులు ఉండగా ఓం రౌత్ విషయంలో మాత్రమే ఆ రేంజ్ లో ట్రోల్స్ ఎందుకు వచ్చాయో ఆయన ఆలోచించాలని నెటిజన్లు చెబుతున్నారు.
మైథలాజికల్ సినిమాలను ఇష్టానుసారం తీస్తే విమర్శలు తప్పవని నెటిజన్లు ఫీలవుతున్నారు. ఓం రౌత్ తర్వాత సినిమాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాలి. భవిష్యత్తులో ఓం రౌత్ సైతం ఆదిపురుష్ ట్రోల్స్ గురించి రియాక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ మాత్రం వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. పారితోషికం పరంగా కూడా ప్రభాస్ (Prabhas) టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.