Adivi Sesh: ఆ కామెంట్లపై క్లారిటీ ఇచ్చిన అడివి శేష్!

అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హిట్2 మూవీ డిసెంబర్ నెల 2వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. నాని నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా కచ్చితంగా అంచనాలను అందుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. హిట్2 ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో కేవలం 24 గంటల్లో 3 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్ల నుంచి హిట్2 ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ సైతం సంతోషిస్తోంది.

అడివి శేష్ మాట్లాడుతూ ఈ సినిమాలోని శ్రద్ధ అనే పాత్రకు నోయిడాలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసుకు సంబంధం లేదని అన్నారు. చెడుపై మంచి గెలుస్తుందనే కోణంలోనే ఈ సినిమాను తెరకెక్కించామని అడివి శేష్ పేర్కొన్నారు. నాకు బాగా నచ్చింది నమ్మింది మాత్రమే నేను చేస్తున్నానని అడివి శేష్ కామెంట్లు చేశారు. ఈ మూవీ కథ నుంచి నేను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని అడివి శేష్ పేర్కొన్నారు.

హిట్2 మొదట తెలుగులో రిలీజ్ అవుతుందని ఆ తర్వాత హిందీలో విడుదలవుతుందని అడివి శేష్ చెప్పుకొచ్చారు. నేను భవిష్యత్తులో ఏ సినిమా చేసినా ఇండియన్ సినిమానే చేస్తానని అడివి శేష్ కామెంట్లు చేశారు. హీరోలు నమ్మిన హీరోను అయినందుకు గర్వంగా ఉందని అడివి శేష్ చెప్పుకొచ్చారు. హిట్3 సినిమాను గ్రాండ్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నానని అడివి శేష్ కామెంట్లు చేశారు.

పోస్టర్ లో ఉన్న గ్లాస్ జనసేన గ్లాస్ కాదని అడివి శేష్ వైరల్ అవుతున్న కామెంట్ల గురించి స్పష్టతనిచ్చారు. పవన్ కళ్యాణ్ కు అకీరా నందన్ కు తన హార్ట్ లో ప్రత్యేక స్థానం ఉందని అడివి శేష్ చెప్పుకొచ్చారు. హిట్2 సినిమాను బిగ్ స్క్రీన్ కోసమే సిద్ధం చేశామని అడివి శేష్ వెల్లడించారు. అడివి శేష్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus