నాని సమర్పణలో ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేని నిర్మాణంలో శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్2’. ‘హిట్’ కాంబినేషన్లోనే ఈ మూవీ రూపొందింది. అయితే హీరో హీరోయిన్లు మారారు. ‘హిట్’ లో విశ్వక్ సేన్, రుహాని శర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. కానీ ‘హిట్2′ లో అడివి శేష్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించడం జరిగింది. రుహని సంగతి పక్కన పెడితే హీరోగా మళ్ళీ విశ్వక్ ను ఎందుకు ఎంపిక చేసుకోలేదు అనే డౌట్ అందరికీ వచ్చింది.’సీక్వెల్ ని ఇంకా నెక్స్ట్ లెవెల్లో చేయాలి..అలాగే ప్రతి సీక్వెల్ కి హీరోని మార్చాలి అనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నట్టు’ దర్శకనిర్మాతలు చెప్పుకొచ్చారు.
కానీ విశ్వక్ కు ఈ కథ నచ్చలేదు అని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. అయితే ‘హిట్3’ కూడా అడివి శేష్ తోనే చేయబోతున్నాడట దర్శకుడు. ఈ విషయాన్ని స్వయంగా హీరో అడివి శేష్ తెలియజేశాడు. ఈరోజు జరిగిన ట్రైలర్ లాంచ్ లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు అడివి శేష్. అడివి శేష్ మాట్లాడుతూ.. ” డైరెక్టర్ శైలేష్‌కి, మన అందరికీ బిగ్గెస్ట్ సెలెబ్రేషన్స్ ఈ ట్రైలర్. ఇంత బాగా కట్ చేసిన శైలేష్, గారికి థాంక్స్. హిట్ యూనివర్స్‌లో రెండో పార్ట్ చాలా కీలకం. ‘హిట్ 3’ లో కూడా నేను ఉన్నాను. అందుకే శైలేష్‌కు థాంక్స్. పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయండని నార్త్ ఆడియెన్స్ అడుగుతుండేవారు.
అందుకే నాని గారితో మాట్లాడి.. పాన్ ఇండియన్ రేంజ్‌లో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాం. నాని గారికి, ప్రశాంతి గారికి థాంక్స్. నాతో ఈ సినిమాను నిర్మించినందుకు థాంక్స్. అన్నపూర్ణలో రెండు చిత్రాలు చేయబోతోన్నాను. అవి కూడా పాన్ ఇండియా సినిమాలే. క్షణం ట్రైలర్‌ను మహేష్ బాబు గారు రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆయనే నన్ను ‘మేజర్’ తో పాన్ ఇండియా హీరోగా చేశారు. ఈ ట్రైలర్ కట్ చేసేందుకు చాలా ఆలోచించాం. ప్రతీ షాట్, ప్రతీ ఫ్రేమ్, డైలాగ్‌కు అర్థం ఉంటుంది. శ్రీనాథ్ నాకు కాంపిటీషన్ అయ్యేలా ఉన్నారు. మీనాక్షి గారు చక్కగా నటించారు. శ్రద్దా గారు అద్భుతంగా నటించారు.
డిసెంబర్ 2న హిట్ 2 రాబోతోంది. జాన్ ఎడ్డూరి అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. శ్రీ చరణ్ పాకాల ట్రైలర్ కోసం పని చేశారు. ఎప్పుడూ ఫైట్లు చేసే నేను డ్యాన్సులు చేశాను. దిశా కేసు సమయంలో మొదటి పార్ట్ వచ్చింది. ఇప్పుడు శ్రద్దా వాకర్ కేసు జరుగుతోంది. కానీ ఇదంతా యాదృశ్చికంగానే జరిగింది. మేజర్‌లో చేసిన పాత్రకు ‘హిట్ 2’లో చేసిన పాత్రకు అస్సలు సంబంధం ఉండదు. ఈ పాత్ర కోసం నేనేమీ రీసెర్చ్ చేయలేదు.
స్క్రిప్టే రీసెర్చ్ చేసినట్టు ఉంది. హిందీ వర్షన్‌లో కాస్త ఆలస్యంగా విడుదలవుతుంది. ఇక్కడ ఉండే ఇండియన్ సినిమాను చేస్తాను. కథ, డైరెక్టర్, నిర్మాత నాని ఇలా అందరి కోసం ఈ సినిమాను చేశాను. ఓ ప్రేక్షకుడిలా కథలో దర్శకుడికి కొన్ని కొన్ని సలహాలు ఇచ్చాను. పాన్ ఇండియా అనేది కథలో ఉండాలి. ఇమేజ్ ఉంది కదా? అని పాన్ ఇండియా సినిమా చేయకూడదు” అంటూ చెప్పుకొచ్చాడు. అడివి శేష్ ‘హిట్3’ పై క్లారిటీ అయితే ఇచ్చాడు కానీ.. అతని స్పీచ్ తో ‘విశ్వక్ .. తన ఇగోతో ఈ ప్రాజెక్టుని కూడా పక్కన పెట్టాడా?’ అనే అనుమానాలను రేకెత్తించాడు. మరి అసలు మేటర్ ఏంటో తెలియాలి.
ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!
మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!