17ఏళ్ళ తరువాత ఆ దర్శకుడితో బాలయ్య
- December 22, 2020 / 01:22 PM ISTByFilmy Focus
నందమూరి బాలకృష్ణ ఒక దర్శకుడికి మాట ఇచ్చారు అంటే అంత ఈజీగా మర్చిపోరని అందరికి తెలిసిన విషయమే. సీనియర్ దర్శకులను నేటితరం హీరోలు పట్టించుకోకపోయినప్పటికి ఆయన మాత్రం మరువ లేదు. కథలు నచ్చకపోతే అడిగి మరి మార్పులు చేయిస్తున్నారు కానీ రిజెక్ట్ చేయడం లేదు. అలాంటి లిస్ట్ లోనే బి.గోపాల్ కూడా ఉన్నారు. ఒకప్పుడు నరసింహ నాయుడు, ఇంద్ర వంటి బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న బి గోపాల్ బాలయ్యతో చాలా మంచి సినిమాలు చేశారు.
చివరగా 2003లో పల్నాటి బ్రహ్మనాయుడు అనే సినిమా చేశారు. కానీ ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఇక 17 ఏళ్ల తరువాత మళ్ళీ ఆ సీనియర్ దర్శకుడికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు బాలయ్య. ఈ కాంబో పై గత ఏడాది నుంచి అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. రైటర్ సాయి మాధవ్ బుర్రా వీరి కాంబినేషన్ కోసం మంచి కథని కూడా సెట్ చేశారు. అయితే కొన్ని మార్పులు అవసరమని బాలయ్య సలహా ఇవ్వగా లాక్ డౌన్ లోనే మొత్తం స్క్రిప్ట్ సిద్ధం చేశారట.

అయితే బోయపాటి ప్రాజెక్టు అయిపోయిన తరువాత సినిమాను స్టార్ట్ చేద్దామని బాలయ్య అయితే ఒక మాట కూడా ఇచ్చినట్లు టాక్ వస్తోంది. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
















