డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) చాలా మంది కొత్త హీరోలను లాంచ్ చేశారు. దివంగత పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar), రాంచరణ్ (Ram Charan), వంటి స్టార్లతో పాటు ఈ లిస్టులో ఇషాన్ కూడా ఉన్నాడు. 2017 లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘రోగ్’ (Rogue) సినిమాతో ఇతను హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పూరీ సినిమాల్లో హీరో ఎంత ఎనర్జిటిక్ గా ఉంటాడో.. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘రోగ్’ లో ఇషాన్ (Ishaan Khatter) కూడా అలానే ఉంటాడు. ఫైట్స్ లో, డైలాగ్ డెలివరీలో అతను పూరీ శైలికి తగ్గట్టు చేసి ఆకట్టుకున్నాడు.
ఆ సినిమా ఫలితం సంగతి పక్కన పెట్టేస్తే.. నటుడిగా ఇషాన్ కి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత ఇతను సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. అందుకు గల కారణాలు ఏంటి అన్నది బయటకు రాలేదు. అయితే ఊహించని విధంగా.. దాదాపు 8 ఏళ్ళ తర్వాత ఇతను హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ‘అడ్డా’ (Adda) ‘ఓటర్’ వంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ రెడ్డి. తన నెక్స్ట్ సినిమాగా ఓ మంచి కమర్షియల్ సబ్జెక్ట్ ను తెరకెక్కించనున్నారు.
‘విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్’ (VFC) అనే బ్యానర్ ను స్థాపించి శివకృష్ణ మందలపు ఈ చిత్రంతో నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రముఖ యాంకర్ స్వప్న చౌదరి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు అని తెలుస్తుంది. స్క్రిప్ట్ అంతా లాక్ అయిపోయిందట. త్వరలోనే మరిన్ని వివరాలు చిత్ర బృందం వెల్లడించనున్నట్లు టాక్ నడుస్తుంది. మరి రీ ఎంట్రీలో అయినా బాగా రాణించి హీరో ఇషాన్ బిజీ అవుతాడేమో చూడాలి.