ఇండ్రస్టీలో ప్రస్తుతం ఏ హీరో సినిమా చూసినా వందలకోట్ల రూపాయల బడ్జెట్ అని చెబుతున్నారు. ప్రభాస్ చేసే ప్రతి సినిమాకు నిర్మాతలు భీభత్సంగా ఖర్చుపెడుతున్నారు. తాజాగా ఈ లిస్టులో జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరాడు. కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం దేవర చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు ఇప్పటికే ప్రకటించారు. రెండు భాగాలమీద కలిపి ఈ సినిమాకు రూ.300 కోట్లు ఖర్చుచేయబోతున్నారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్ తో భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించేందుకు నిర్మాతలు ముందుకొస్తున్నారు. ఇప్పటివరకు జూనియర్ చేసిన సినిమాల్లో దేవర చిత్రానిదే అత్యధిక బడ్జెట్. దీనితర్వాత హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వార్ 2లో తారక్ నటిస్తున్నాడు. దీని షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. RRR సినిమాతో నట విశ్వరూపాన్ని చూపించిన తారక్ వార్ 2 చిత్రంతో బాలీవుడ్ లో జెండా పాతడం ఖాయమని అభిమానులు సంబరంగా చెప్పుకుంటున్నారు.
ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మాతలు రూ.500 కోట్ల వ్యయంతో తెరకెక్కిస్తున్నారు. 300 సంవత్సరాల తర్వాత అద్భుత యోగాలు ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఓ సినిమా చేయబోతున్నారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దీని బడ్జెట్ రూ.400 కోట్లు అని తెలుస్తోంది. ఈ సినిమాను కూడా రెండు భాగాలుగా విడుదల చేయాలనే యోచనలో నిర్మాత, దర్శకులున్నారు.
అయితే ఇప్పుడు దేవర, వార్2, ప్రశాంత్ నీల్.. ఈ మూడు సినిమాల బడ్జెట్ రూ.1200 కోట్లుగా తేలింది. గ్లోబల్ స్టార్ గా మారిపోయిన తమ హీరో భవిష్యత్తులో కొత్త రికార్డులు సృష్టిస్తాడని, బాలీవుడ్ లో చక్రం తిప్పుతాడని అభిమానులు ఎంతో నమ్మకంతో చెబుతున్నారు. ప్రభాస్ (Prabhas) తర్వాత మన టాలీవుడ్ నుండి అంత భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నది ఎన్టీఆర్ మాత్రమేనట.