ఏ సినిమాని అయినా ప్రేక్షకుల వరకు తీసుకెళ్లేది మీడియానే. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ విషయాన్ని ఫిలిం మేకర్స్ కూడా ఒప్పుకుంటారు. కానీ రివ్యూల విషయానికి వచ్చేసరికి.. ‘మీడియా వాళ్ళు వేరు’ అన్నట్టు మాట్లాడుతూ వస్తున్నారు. మొన్నటికి మొన్న ‘మంత్ ఆఫ్ మధు’ ప్రెస్ మీట్లో.. దీని గురించి ఎక్కువ డిస్కషనే జరిగింది. అయితే కొంతమంది రిపోర్టర్లు పనిగట్టుకుని.. సినిమాని బ్యాడ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్న మాట వాస్తవం.
అందులో ఓ బ్లాక్ మెయిలింగ్ మీడియా సంస్థ ఉంది. చాలా మందికి అది తెలుసు. వివాదాలతో పాపులర్ అయిన సంస్థ(రిపోర్టర్) అది. వాళ్ళు పెట్టే పోస్టులు అన్నీ కూడా ఫిలిం మేకర్స్ ను బ్లాక్ మెయిల్ చేయడం కోసమే అన్నట్లు ఉంటాయి. ‘ ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో రొమాన్స్ లేదు’ అంటూ రివ్యూలో రాసుకొచ్చింది ఆ సంస్థ(రిపోర్టర్). తర్వాత దానికి కవరింగ్ గా మరో పోస్ట్ పెట్టుకోవడం కూడా చేసింది.
సరిగ్గా అదే విధంగా ఇప్పుడు ‘భగవంత్ కేసరి’ సినిమా విషయంలో కూడా స్పందించింది.
ఈ సినిమాలో శ్రీలీల డాన్స్ లు, గ్లామర్ మిస్ అయ్యిందంటూ ఆ సంస్థ(రిపోర్టర్, రివ్యూలో) రాసుకొచ్చింది. ఇది దర్శకుడు అనిల్ రావిపూడిని బాగా హర్ట్ చేసింది. ‘తండ్రీ కూతుర్ల సెంటిమెంట్ కలిగిన సినిమాలో అతనికి(సంస్థ, రిపోర్టర్) శ్రీలీల నుండి గ్లామర్, డాన్స్ కావాలట. అతను నాకు తెలుసు.. అన్నీ ఇలాంటివే రాస్తాడు’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు అనిల్ రావిపూడి. దీంతో ఇతని(అనిల్ రావిపూడి) (Anil Ravipudi) ఆవేదనలో తప్పేమీ లేదు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.