కరోనా ఫస్ట్ వేవ్ వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీ నిర్మాతలు కోట్ల రూపాయలు నష్టపోయిన సంగతి తెలిసిందే. జనవరి నెల నుంచి సాధారణ పరిస్థితులు ఏర్పడగా సెకండ్ వేవ్ లో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసుల వల్ల స్టార్ హీరోల సినిమాల షూటింగులు ఆగిపోతున్నాయి. టాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై కూడా కరోనా ప్రభావం పడటం గమనార్హం. ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ ముంబైలో గ్రీన్ మ్యాట్ బ్యాక్ డ్రాప్ లో జరపాల్సి ఉండగా మహారాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నిబంధనల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిందని తెలుస్తోంది.
ముంబైలో కరోనా కేసులు తగ్గిన తరువాత రాజమౌళి ప్లాన్ చేసిన షెడ్యూల్ ను పూర్తి చేసే అవకాశం ఉంది. మరోవైపు జక్కన్న ఆర్‌ఆర్‌ఆర్ వల్ల టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి సినిమాలకు గతంలో రిలీజ్ డేట్లు మారినా ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే రిలీజ్ డేట్ మారింది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను జక్కన్న మొదట 2020 సంవత్సరం జులై 30వ తేదీన రిలీజ్ చేయాలని భావించారు. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ సినిమా రిలీజ్ డేట్ ను 2021 సంవత్సరం జనవరి 8వ తేదీకి మార్చారు.
అనంతరం కరోనా వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ ఏడాది అక్టోబర్ 13న ఆర్‌ఆర్‌ఆర్ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు రాజమౌళి ప్రకటించారు. ఆర్‌ఆర్‌ఆర్ రిలీజ్ డేట్ మళ్లీ మారితే మాత్రం ఆ ప్రభావం సినిమాపై పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జక్కన్న సినీ కెరీర్ లో తొలిసారి ఈ విధంగా జరుగుతుండటం గమనార్హం.