తెలుగు ప్రజలకు సంక్రాంతి ప్రత్యేక పండుగ. తెలుగు హీరోలకు మాత్రం మరింత స్పెషల్. ఆ పెద్ద పండుగనాడు తమ సినిమాలతో బరిలోకి దిగుతారు. పోటీ నీదా.. నాదా.. అంటూ సవాల్ విసురుతారు. ఈ ఆనవాయితీ ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి ఉంది. రెండో తరం హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ మధ్య కొన్నేళ్లుగా పోటీ కొనసాగింది. ప్రతి సంక్రాంతికి వీరి సినిమాలు ఉండేవి. ఒక సారి మెగాస్టార్ మూవీ హిట్ కొడితే మరో సారీ బాలయ్య ప్రతాపం చూపించేవారు.
ఇలా ఇప్పటి వరకు 18 సార్లు ఈ స్టార్ హీరోల సినిమాలు పెద్ద పండుగనాడు పోటీకి దిగాయి. అందులో ఎక్కువ సార్లు బాలకృష్ణ విజయం సొంతం చేసుకొని సంక్రాంతి హీరోగా పేరు తెచ్చుకున్నారు. చివరి సారి వీరిద్దరూ 2001 లో తల పడ్డారు. చిరు మృగరాజుగా రంగంలోకి దిగగా, బాలయ్య నరసింహ నాయుడిగా తొడగొట్టారు. అప్పుడు బాలకృష్ణ చిత్రం సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వీరి చిత్రాలు సంక్రాంతికి క్లాష్ కాలేదు. మళ్ళీ పదిహేనేళ్ల తర్వాత సీనియర్ హీరోల చిత్రాలు పోటీ పడనున్నాయి. చిరు ఖైదీ నంబర్ 150 అంటూ వస్తుండగా, బాలయ్య గౌతమి పుత్ర శాతకర్ణి గా యుద్ధానికి ఆహ్వానిస్తున్నారు. 19వ సారి పందెంలో గెలుపెవరిదో మరికొన్ని రోజుల్లో తెలియనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.