ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (ఏఐ)… దీని గురించి ఇప్పుడు మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నాం. కానీ త్వరలో రోజూ ఇంకా చెప్పాలంటే ప్రతి క్షణం మాట్లాడుకుంటాం. ఈ మాట మేం అనేది కాదు. టెక్నాలజీ రంగంలో నిష్ణాతులు అయినవాళ్లు చెబుతున్న మాట ఇది. అయిఏ ఏఐ రెండువైపులా వాడి ఉన్న కత్తి లాంటిది అని చెబుతున్నారు. మంచి చేస్తే మంచి అవుతుంది, చెడు చేయాలనుకుంటే చెడు అవుతుంది. అలా మంచి చేస్తే ఎలా ఉంటుందో ఇటీవల తారక్ ఫొటోతో తేలింది.
ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్ శ్రీనివాస్ మోహన్ ఇటీవల ఓ ఫొటో షేర్ చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రచారం సమయంలో వైరల్ అయిన తారక్ ఫొటోను ఏఐతో కొత్తగా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆ ఫొటోలో చూపించారు. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాయ అని… దీనికి ఎవరైనా వావ్ అనాల్సిందే అని ఆ ఫొటోను చూసిన నెటిజన్లు అంటున్నారు. అంతేకాదు ఆ పొటోను తెగ షేర్ చేస్తున్నారు. అయితే అది అంతటితో ఆగలేదు.
కేవలం తారక్ ఫొటోను మాత్రమే అలా చేస్తే ఎలా అంటూ.. కొంతమంది నెటిజన్లు, టెక్ సేవీలు అయితే మిగిలిన స్టార్ హీరోల ఫొటోలను కూడా ఇలానే మారుస్తున్నారు. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన హీరోలు ప్రకృతిలో ఓదిగిపోయేలా తీర్చిదిద్దిన ఆ ఫొటోలను మీరు కూడా సోషల్ మీడియాలో చూసే ఉంటారు. అన్ని ఫొటోలను ఒక్క దగ్గర చూపించే ప్రయత్నమే ఇది.
పవన కల్యాణ్ ఫ్యాన్స్ పీకేను గన్స్‌తో సిద్ధం చేయగా, మహేశ్ బాబు ఫ్యాన్స్ అగ్నిపర్వతాలతో ఏఐ మాయ చేశారు. ‘ఓజీ’ సినిమా రిఫరెన్స్‌తో పవన్‌ను అలా చూపించగా… రాజమౌళి సినిమా రిఫరెన్స్‌తో మహేష్ పోస్టర్ సిద్ధమైంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మరో అడుగు ముందుకేసి డైనోసర్‌ను ఫొటో చేయడానికి వాడుకునర్నారు. ‘సలార్’ సినిమాతో డార్లింగ్ అలానే ఉంటాడని టినూ ఆనంద్ టీజర్‌లో చెప్పారుగా. ఇంకొన్ని రోజులు ఆగితే ఇలాంటివి చాలానే వస్తాయి.