Aishwarya Rajesh: రష్మిక పై హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కామెంట్స్ వైరల్!

  • May 13, 2023 / 04:56 PM IST

రష్మిక మందన.. ‘ఛలో’ ‘గీత గోవిందం’ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ‘పుష్ప’ చిత్రమైతే ఈమెను పాన్ ఇండియా హీరోయిన్ గా, నేషనల్ క్రష్ గా ఎదిగింది. ‘సీతా రామం’ చిత్రం కూడా ఈమెకు మంచి సక్సెస్ ను అందించింది. అయితే ఈమె బాలీవుడ్లో చేసిన సినిమాలు ప్లాప్ అయ్యాయి. అయినా ఈమె ఇమేజ్ అయితే ఏమాత్రం తగ్గలేదు. ‘వారిసు’ చిత్రంతో తమిళంలో కూడా ఈమె స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

అయితే రష్మిక ఎంత స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఆమె పై నిరంతరం ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈమె బయట కొంచెం అతి చేస్తూ ఉంటుందని నెటిజెన్ల కామెంట్లు చేస్తుంటారు. అలాగే సినిమాల్లో ఈమె నటన కూడా సహజంగా ఉండదని అంటుంటారు. ఇదిలా ఉండగా.. ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లి అనే పాత్రలో రష్మిక నటించింది. ఈ పాత్ర ఆమెకు సెట్ అవ్వలేదు అని కామెంట్లు చేసిన బ్యాచ్ కూడా ఉన్నారు.

చిత్తూర్ స్లాంగ్ ఈమె (Aishwarya Rajesh) పట్టి పట్టి చెప్పిందని చాలా మంది కామెంట్లు చేశారు. అంతా ఎలా ఉన్నా.. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ అయితే ‘పుష్ప’ లో రష్మిక పాత్రను ఆమె కంటే నేను బాగా చేసేదాన్ని అంటూ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు ఐశ్వర్య రాజేష్. ‘టాలీవుడ్ అంటే నాకు చాలా ఇష్టం. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంతో నేను తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాను.

అయితే నాకు ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లి అనే డీ గ్లామరస్ పాత్ర బాగా సూట్ అయ్యేది. రష్మిక కంటే కూడా నేను ఆ పాత్రను బాగా చేసేదాన్ని’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అంటే రష్మిక బాగా చేయలేదా? అని అడిగితే.. ‘ఆమె బాగా చేయలేదు అని నేను అనడం లేదు. నేనైతే ఆ పాత్రకు కరెక్ట్ అని నా అభిప్రాయం’ అంటూ ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చింది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus