సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ మూవీ ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. చెన్నైలో లాల్ సలామ్ ఆడియో లాంఛ్ ఈవెంట్ జరగగా ఈ సినిమాకు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకుడు కావడం గమనార్హం. ఐశ్వర్య మాట్లాడుతూ సినిమా రంగంలో తనకు ఎదురవుతున్న సవాళ్ల గురించి చెప్పుకొచ్చారు. మా నాన్నగారు 35 సంవత్సరాలుగా వెండితెరపై నటించి మంచి పేరు తెచ్చుకున్నారని ఐశ్వర్య అన్నారు.
ఆ పేరుకు భంగం కలిగించే హక్కు ఏ కూతురికి ఉండదని ఐశ్వర్య వెల్లడించారు. లాల్ సలామ్ కథ నచ్చడంతో ఈ సినిమాలో నటించడానికి నాన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఐశ్వర్య పేర్కొన్నారు. అందరూ అనుకున్న విధంగా నాన్న నాకోసం ఈ సినిమాలో నటించలేదని ఐశ్వర్య పేర్కొన్నారు. ఈ సినిమా కొరకు పని చేసిన టీమ్ ను నమ్మి రజనీకాంత్, ఏఆర్ రెహమాన్ ఈ సినిమా కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఐశ్వర్య కామెంట్లు చేశారు.
ఈ సినిమా కోసం వాళ్లిద్దరూ పని చేయడం గొప్ప వరం అని ఐశ్వర్య చెప్పుకొచ్చారు. స్టార్ హీరోకు కూతురు అయినంత మాత్రాన ఈ ఇండస్ట్రీలో ఎవరూ అవకాశం ఇవ్వరని ఐశ్వర్య కామెంట్లు చేశారు. సినిమా ఇండస్ట్రీలో మీరు పెద్ద వ్యక్తి అయినా సినిమా ఛాన్స్ ఇవ్వరని ఐశ్వర్య వెల్లడించారు. కొత్తవాళ్లకు ఛాన్స్ ఇస్తారు కానీ మాకు ఛాన్స్ ఇవ్వరని ఈ విషయం ఇండస్ట్రీలో ఉన్నవాళ్లకే తెలుస్తుందని ఐశ్వర్య అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎన్నో అవాంతరాలు వచ్చినా ముందుకు సాగామని ఈ సినిమాకు రెండేళ్ల సమయం కేటాయించడం వల్ల నా పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోయానని వారి పాఠశాల మీటింగ్ లకు హాజరు కాలేదని అయినా వారు నాకు సపోర్ట్ చేస్తారని నా పిల్లలే నాకు గొప్ప బహుమతి అని ఐశ్వర్య వెల్లడించారు. నాన్నపై వస్తున్న నెగిటివ్ వార్తలు వింటే కోపం వస్తుందని మాకు కూడా ఎమోషన్స్ ఉంటాయని ఆమె చెప్పుకొచ్చారు. నా తండ్రిని సంఘీ అంటూ ప్రచారం చేస్తే బాధేస్తుందని ఆమె తెలిపారు.
మా నాన్న సంఘీ కాదని ఆమె అన్నారు. ఆయన అలాంటి వ్యక్తి అయితే లాల్ సలామ్ లో నటించేవారు కాదని ఐశ్వర్య అన్నారు. మానవత్వం ఉన్న వ్యక్తి మాత్రమే ఈ సినిమాకు సెట్ అవుతారని భావించి నాన్నను ఈ సినిమా కోసం ఎంపిక చేయడం జరిగిందని ఐశ్వర్య కామెంట్లు చేశారు. ఐశ్వర్య (Aishwarya) వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.