‘మహాసముద్రం’ రిజల్ట్ : ఫ్యాన్స్ సారి చెప్పిన దర్శకుడు అజయ్ భూపతి..!

అదేంటో టాలీవుడ్లో ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్లు.. రెండో సినిమాతో అంత ఈజీగా హిట్టు కొట్టలేరు. ప్లాప్ అయిన రెండో సినిమా వలన ఆ డైరెక్టర్లు తీసిన మొదటి సినిమాని కూడా విమర్శిస్తుంటారు ప్రేక్షకులు.సరిగ్గా ఇప్పుడు దర్శకుడు అజయ్ భూపతి విషయంలో కూడా ఇదే జరిగింది. అతను తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘మహాసముద్రం’ ఇటీవల విడుదలై పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

ఈ చిత్రంతో ఎలాగైనా హిట్టు కొట్టి బౌన్స్ బ్యాక్ కొట్టాలని శర్వానంద్ అనుకున్నాడు. సిద్దార్థ్ కు కూడా ఇది మంచి కంబ్యాక్ చిత్రం అవుతుంది అనుకున్నారు. హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కూడా అలాగే ఆశపడింది. కానీ కట్ చేస్తే వాళ్ళ ఆలోచనలు తలక్రిందులు అయిపోయాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల సోషల్ మీడియాలో ఓ అభిమాని.. ‘ ‘మహాసముద్రం’ ఏంటన్నా అలా తీసావ్? నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా’ అంటూ అజయ్ భూపతిని ట్యాగ్ చేసాడు. అతని ప్రశ్న పై దర్శకుడు అజయ్ భూపతి స్పందిస్తూ..

“నీ అంచనాలను అందుకోలేకపోయినందుకు నన్ను క్షమించు. నా తర్వాతి చిత్రంతో నిన్ను సంతృప్తిపరుస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు. అజయ్ భూపతి స్పందన పై కొంతమంది నెటిజన్లు ఘాటు కామెంట్లు పెడుతున్నారు. ‘మీ ‘ఆర్.ఎక్స్.100′ మూవీ అదృష్టం కొద్దీ హిట్ అయ్యిందే తప్ప అందులో మేటర్ లేదు. మీకు రెండో ఛాన్స్ ఇవ్వడానికి ఏ హీరో కూడా చాలా రోజులు ముందుకు రాలేదు.. ఇప్పుడు ఇంకో ఛాన్స్ ఎవరిస్తారు అన్నా’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Share.