విక్టరీ వెంకటేష్ (Venkatesh) చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. ఆయనకు కథలు నచ్చినా.. తర్వాత సురేష్ బాబు (D. Suresh Babu) ఇన్వాల్వ్ అయ్యి ఫైనల్ డెసిషన్ తీసుకుంటేనే.. అది సెట్స్ పైకి వెళ్తుంది. సురేష్ బాబు నో చెబితే.. వెంకటేష్ లైట్ తీసుకుంటారు. అందుకే చాలా మంది యువ దర్శకులు.. వెంకటేష్ తో సినిమాలు చేయాలని ప్రయత్నించినా.. అవి ఫలించడం లేదు. యువ దర్శకులు అనే కాదు.. త్రివిక్రమ్ (Trivikram) వంటి స్టార్ డైరెక్టర్ కి కూడా ఇదే ప్రాబ్లమ్.
వెంకటేష్ తో సినిమా చేయాలని ఆయన చాలా ఏళ్ళ నుండి ప్రయత్నిస్తున్నారు. కానీ పారితోషికాల లెక్కల దగ్గర వ్యవహారం కుదరట్లేదు అనేది ఇన్సైడ్ టాక్. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఇటీవల నందు అనే యువ దర్శకుడు వెంకటేష్ ను కలిసి కథ వినిపించాడు. అది వెంకీకి బాగా నచ్చింది. గతంలో ‘సామజవరగమన’ (Samajavaragamana) అనే సూపర్ హిట్ సినిమాకి ఇతను పనిచేశాడు శ్రీనివాసా చిట్టూరి నిర్మించడానికి రెడీగా ఉన్నారు.
కానీ సురేష్ బాబు.. దగ్గరకు వచ్చేసరికి తేడా కొట్టేసింది. ఆ ప్రాజెక్టు సెట్ అవ్వలేదు. ఇప్పుడు అదే కథలో కొన్ని మార్పులు చేసి..తీసుకెళ్లి అఖిల్ కి చెప్పాడు నందు. ఇది అతనికి నచ్చింది. తర్వాత నాగార్జున (Nagarjuna) కూడా విన్నారు. ఓకే చేసేశారు. ప్రస్తుతం అఖిల్ (Akhil Akkineni) .. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. దీంతో సమాంతరంగా నందు సినిమా కూడా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.