Bigg Boss Non-Stop: అఖిల్ ముఖం పైనే అలా చెప్పేశాడేంటి..? ఆమె పేరు మర్చిపోయాడా..?

బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ స్ట్రాటజీలు అప్పుడే స్ట్రార్ట్ అయ్యాయి. ముమైత్ ఖాన్ నామినేషన్స్ గురించి వర్రీ అవుతుంటే, అఖిల్ కూల్ చేశాడు. లైట్స్ అపేసిన తర్వాత అషూరెడ్డి, ఇంకా అఖిల్ ఇద్దరూ డైనింగ్ ఏరియాలో కాసేపు డిస్కస్ చేస్కున్నారు. ఆర్జే చైతూ నన్ను పిలిచి సైకో క్యారెక్టర్ ఉంది కరెక్ట్ గా సరిపోతాడని చెప్తున్నాడని, ఆమె ఎవరో ప్రొడ్యూసర్ అంట కదా అంటూ శ్రీరాపక గురించి మాట్లాడుకున్నారు. అలాగే, మిత్రాశర్మ కూడా ప్రొడ్యూసర్ కాబట్టి వీళ్లలో మిత్రా పేరు చెప్పబోయి శ్రీరాపక పేరు చెప్పాడా అనేది క్లారిటీ లేదు. అంతేకాదు, అఖిల్ సార్ధక్ తను చాలా ఆపర్చునిటీస్ ని వద్దనుకుని బిగ్ బాస్ నాన్ స్టాప్ కి వచ్చానని చెప్పాడు.

తను ఆడిషన్స్ చేసి తీస్కుంటాను అని చెప్తోందని, అసలు నేను చేయను అంటే మళ్లీ ఆడిషన్స్ ఏంటి నాన్సెస్ అంటూ మాట్లాడాడు. అఖిల్ ఇక్కడ క్లియర్ గా ప్రొడ్యూసర్ గురించి తను సినిమా తీస్తోందని చెప్పాడు. అయితే, మద్యలో ఆర్జే చైతూని సైకో క్యారెక్టర్ కి అడిగితే, అఖిల్ అయితే కరెక్ట్ గా సెట్ అయితాడని నన్ను ఇన్వాల్ చేశాడని అషూతో చెప్పుకొచ్చాడు.

ఇక్కడ సీనియర్స్ జూనియర్స్ అనే తేడాలేంటి అని, అలా అనడం కూడా నాకు నచ్చడం లేదని అషూరెడ్డి అభిప్రాయపడింది. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినపుడు అందరూ సమానమే అంటూ మాట్లాడింది. ఇక వీరిద్దరూ కాసేపు ఇదే విషయంపై మాట్లాడుకున్నారు. అంతకుముందు ముమైత్ ఖాన్ నామినేషన్స్ గురించి మాట్లాడుతున్నా కూడా నీకు మైండ్ లో ఏది ఉంటే అదే చేయి అన్నట్లుగా చెప్పాడు అఖిల్.

అవసరం అయితే నన్ను కూడా నామినేట్ చేయి అంటూ ముమైత్ ముఖంపైనే చెప్పేశాడు. దీంతో అఖిల్ గేమ్ ఎలా ఆడాలి అనేది ఫుల్ క్లారిటీ ఉన్నట్లుగా అర్ధం అవుతోంది. అంతేకాదు, సీజన్ 4లో కాస్త తగ్గిన తన ఫాలోయింగ్ ని ఇప్పుడు అఖిల్ ఫుల్ గా వాడుకుని ఎలాగైనా సరే టైటిల్ ఎగరేసుకుపోవాలనే చూస్తున్నాడు. టైటిల్ రేసులో అఖిల్ ఇప్పుడు అందరికంటే ఒక మెట్టు ఎక్కువే ఉన్నాడు. అదీ విషయం.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus