యంగ్ హీరో అఖిల్ ఇప్పటివరకు నాలుగు సినిమాల్లో హీరోగా నటించగా ఈ సినిమాలలో ఏ సినిమా 30 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మినహా అఖిల్ ఖాతాలో మరో సక్సెస్ లేదనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఏజెంట్ సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఈ సినిమాకు కథ అందించడం గమనార్హం. ఈ సినిమా కోసం నిర్మాత 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఖర్చు చేస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం హీరో, డైరెక్టర్ తమ రెమ్యునరేషన్లను తగ్గించుకుని ఈ సినిమా కొరకు పని చేస్తున్నారు. అఖిల్ ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. ఏజెంట్ విడుదలై సక్సెస్ సాధిస్తే అఖిల్ లాభాల్లో వాటా తీసుకోనున్నారు. మరోవైపు దర్శకుడు సురేందర్ రెడ్డి మొదట ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకుంటారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే సురేందర్ రెడ్డి తాను తక్కువ రెమ్యునరేషన్ కు ఈ సినిమా కోసం పని చేస్తానని నిర్మాతకు చెప్పినట్టు సమాచారం.
అఖిల్ కెరీర్ ఏజెంట్ సినిమాపై ఆధారపడి ఉందని చెప్పవచ్చు. అక్కినేని హీరోల సినిమాలేవీ ఇప్పటివరకు 55 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించలేదు. ఏజెంట్ సినిమాతో అఖిల్ భారీ కలెక్షన్ల రికార్డులను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. రచయిత వక్కంతం వంశీ సైతం ఈ సినిమాతో సక్సెస్ సాధించి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. భారీ సినిమా తనకు ముఖ్యమని భావించి రెమ్యునరేషన్ తీసుకోకుండా అఖిల్ నటిస్తుండగా ఈ సినిమాతో అఖిల్ కోరుకున్న సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.
ఈ ఏడాదే ఏజెంట్ మూవీ రిలీజయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అఖిల్ సినిమాల కథల ఎంపికలో, డైరెక్టర్ల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో అఖిల్ కు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.