పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తనయుడు అకిరా నందన్ చాలా అరుదుగా మీడియా ముందుకు వస్తాడు. అందుకే అతని ఫోటోలు బయటకొచ్చినప్పుడల్లా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతాయి. గతంలో అకిరా ఎక్కువగా తల్లి రేణు దేశాయ్ (Renu Desai) దగ్గర ఉండేవాడు. కానీ ఇటీవల ఏపీ ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ పక్కనే ఎక్కువగా కనిపిస్తున్నాడు. జనసేన విజయంతో అకిరా తండ్రితో మరింత సమయం గడుపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ తన దక్షిణాది ఆలయ యాత్రలో అకిరా కూడా పాల్గొనడం అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ కేరళలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పవన్‌తో పాటు అకిరా కూడా అక్కడ పూజల్లో పాల్గొన్నాడు. పవన్ ఈ యాత్రను సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా నిర్వహిస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. అయితే అకిరా తండ్రికి తోడుగా దర్శనాలకు రావడం అభిమానుల్లో ఆసక్తిని కలిగించింది. పవన్ వెంట అకిరా ఈ రీతిలో ఆలయ దర్శనాలకు రావడం, పూజల్లో భాగస్వామ్యం కావడం చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఈ సారి అకిరా లుక్‌కి స్పెషల్ అటెన్షన్ వచ్చింది. సాధారణంగా కూల్ స్టైల్స్‌లో కనిపించే అకిరా, ట్రెడిషనల్ లుక్‌లో కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. పొడవాటి గడ్డం, ముచ్చటైన జుట్టుతో అకిరా తన తండ్రి పవన్ కళ్యాణ్‌ను పోలినట్టే కనిపిస్తున్నాడు.
తెల్లటి కుర్తా ధరించి పవన్ స్టైల్‌లో ఉండటంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అకిరా లుక్ వైరల్ అవుతోంది. తండ్రికి తగ్గ కొడుకు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లుక్కు మారడంతో సినిమాలపైనే దృష్టి పెడుతున్నాడా? అనే చర్చను తెరపైకి తెచ్చింది. అతని వయసు ప్రస్తుతం 20 సంవత్సరాలు. ఇక పవన్ అభిమానులు అకిరా ఎప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడా అని ఎదురు చూస్తున్నారు. గతంలో అకిరా హీరో అవుతాడా? అనే ప్రశ్నకు రేణు దేశాయ్ క్లారిటీ ఇవ్వలేదు.
అతనికి సంగీతం అంటే ఎక్కువ ఆసక్తి ఉందని, నటన గురించి చెప్పలేమని పేర్కొన్నారు. కానీ అకిరా లేటెస్ట్ లుక్ చూసిన అభిమానులు మాత్రం అతని ఎంట్రీ కన్‌ఫర్మ్ అనే హింట్ ఇచ్చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఇప్పటికే స్టార్ కిడ్స్ వరుసగా హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక పవన్ కుమారుడు అకిరా మాస్ హీరోగా రాబోతాడా? లేదా సంగీతం వైపు వెళతాడా? అనే అంశం పక్కనబెడితే, అతని లేటెస్ట్ లుక్ అభిమానుల్లో కొత్త అంచనాలను క్రియేట్ చేస్తోంది.
1
2
3
4
5
6
7
8
9
10