శంకర్ – రజని కాంబినేషన్ లో రోబో సినిమాకు సీక్వల్ గా వచ్చిన ‘2.o’ సినిమా ఇటీవలే విడుదల కాగా ఈ సినిమాలో రజినీకాంత్ క్యారెక్టర్, చిట్టి రోబో క్యారెక్టర్ రోబో సినిమాలో మాదిరిగానే ఉండగా ఇప్పుడు ‘2.o’ సినిమాలో అందరిని బాగా అక్కటుకుంటుంది విలన్ గా చేసిన అక్షయ్ కుమార్ పాత్ర. ఇందులో అక్షయ్ కుమార్ విలన్ గా నటించినప్పటికీ ఫ్లాష్ బ్యాక్ లో ఆయన పాత్ర అందరిని హద్దుకొని ఆలోచించే విధంగా ఉంటుంది. అయితే డైరెక్టర్ శంకర్ రియల్ లైఫ్ లో ఒకరిని స్ఫూర్తిగా తీసుకొని ఈ క్యారెక్టర్ ని డిజైన్ చేసాడని అంటున్నారు.
అయితే పక్షి రాజు పాత్ర కి ఇన్సిపిరేషన్ సలీమ్ అలీ అంటా. ఈయనకి బర్డ్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా అనే బిరుదు కూడా ఉంది. మన దేశంలో పూర్తిగా పక్షుల గురించి సర్వే చేసిన మొదటి వ్యక్తి ఇతడే అని చెబుతారు. ఇలా పక్షి జాతులపైనా సమగ్ర సర్వే నిర్వహించి పక్షుల జీవనం గురించి చెప్పే ఎన్నో విషయాల గురించి పుస్తకాలూ వ్రాసాడు. అంతేకాకుండా రాజస్థాన్ లో భారతపుర లో మొట్టమొదట పక్షుల గురించి ఒక అభయారణ్యాన్ని నెలకొల్పారు. ఇలా సలీమ్ అలీ గారు అందించిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో ఆయన్ని గౌరవించింది.
ఇక ఈ సినిమా రచయిత జయమోహన్ చెప్పిన వివరాల ప్రకారం, టెక్నాలజీ కారణంగా ప్రస్తుతం జరుగుతున్న నాశనం గురించి ఆయన చూసి ఉంటె ఎలా ఆవేదనకి గురవుతారో ఆలోచించి ఈ పాత్రని తీర్చిద్దిదామని చెప్పాడట. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ పక్షి రాజు పాత్రకి పూర్తీ న్యాయం చేయగా ప్రేక్షకుల నుండి ఊహించని స్పందన అనేది వస్తుంది.