Alekhya Reddy: తారకరత్నలా నేను కూడా వదిలిపెట్టను.. అలేఖ్య కామెంట్స్ వైరల్!

తారకరత్న (Nandamuri Taraka Ratna) మృతి చెంది సంవత్సరాలు గడుస్తున్నా ఆయన అభిమానులు మాత్రం తారకరత్నను ఏదో ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అలేఖ్యారెడ్డి తాజాగా నెటిజన్లతో ముచ్చటించగా ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఒక నెటిజన్ తారకరత్న కుటుంబం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుందనే నమ్మకం ఉందా అని అడిగాడు. ఆ ప్రశ్నకు అలేఖ్య సమాధానం ఇస్తూ ఆశ, నమ్మకం మనల్ని ముందుకు నడిపిస్తాయని ఆ నమ్మకంతో ఇన్ని సంవత్సరాలు ముందుకు సాగుతూ వచ్చామని ఆమె పేర్కొన్నారు.

తారకరత్న ఆశ, నమ్మకాన్ని ఎప్పుడూ వదిలిపెట్టలేదని అలేఖ్య వెల్లడించారు. నేను కూడా వదిలిపెట్టనని ఆమె కామెంట్లు చేశారు. కచ్చితంగా ఏదో ఒకరోజు అది జరుగుతుందని నాకు నమ్మకం ఉందని అలేఖ్య పేర్కొన్నారు. నా పిల్లలకు కచ్చితంగా ఒక కుటుంబం ఉంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. అలేఖ్యారెడ్డి ఆలోచనా తీరును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అలేఖ్యారెడ్డికి తారకరత్న కుటుంబంతో ఉన్న చిన్నచిన్న సమస్యలు వేగంగా పరిష్కారం కావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అలేఖ్య పిల్లలను ప్రయోజకులను చేయాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. గతేడాది గుండె సంబంధిత సమస్యల వల్ల తారకరత్న మృతి చెందారు. మంచి మనిషిగా పేరు సంపాదించుకున్న తారకరత్న మృతి చెందడం అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది. అలేఖ్యారెడ్డి మీడియాకు, ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటున్నారు.

బాలకృష్ణ (Balakrishna) అలేఖ్య కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడుతున్నారని సమాచారం అందుతోంది. అలేఖ్యారెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లైఫ్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలను పంచుకుంటున్నారు. ఈ ఎన్నికల సమయంలో కూటమికే మద్దతు ఇస్తున్నట్టు ఆమె ప్రకటించడం జరిగింది. అలేఖ్యారెడ్డి రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగినా ఆ ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus