Ali: ‘ఎఫ్‌ 3’ అలీ ‘బరువైన’ పాత్ర చేశారట!

‘ఆడదంటే ఔరత్‌… ఔరత్‌ అంటే స్త్రీ’… ఇలాంటి డైలాగ్‌లతో ‘ఎఫ్‌ 3’ సినిమాలో సందడి చేయనున్నారు అలీ. ఈ మధ్య ఓ టీవీ షోలో ఈ విషయం చెప్పారు. అయితే తాజాగా ఆ సినిమాలో అలీ పాత్ర గురించి ఆసక్తికర విషయం బయటికొచ్చింది. అదే ఆ సినిమాలో అలీ పేరు. ‘ఎఫ్‌ 3’లో అలీ పాల బేబీ అనే పాత్రలో కనిపిస్తారట. అదేంటి పేరు విచిత్రంగా ఉంది అనుకుంటున్నారా? అనిల్‌ రావిపూడి సినిమా కదా అలానే ఉంటుంది లెండి.

ఈ సినిమా అలీ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ‘‘కుటుంబ కథలు అరుదుగా తెరకెక్కుతున్న రోజులివి. అందులోనూ పదుల సంఖ్యలో నటులతో సినిమాలు తీసే దర్శకులు తక్కువైపోయారు. ఈ సమయంలో కె.రాఘవేంద్రరావు, ఈవీవీ సత్యనారాయణ, దాసరి నారాయణరావును అనిల్‌ రావిపూడి గుర్తు చేస్తున్నారు’’ అన్నారు అలీ. ‘ఎఫ్‌3’ పతాక సన్నివేశాలు తెరకెక్కించే సమయంలో సెట్లో 30కిపైగా కార్‌వ్యాన్లు కనిపించాయని చెప్పారాయన. ఒకప్పటిలా సెట్‌లో సందడి వాతావరణం కనిపించింది అని చెప్పారు.

సెట్‌లో అంత మంది నటులున్నా… అనిల్‌ రావిపూడి ఏ మాత్రం బెరుకు లేకుండా చిత్రీకరణ చేస్తుంటాడు అని పొగిడేశారు అలీ. ముందు చెప్పినట్లు ఈ సినిమాలో పాల బేబీ అనే పాత్రని అలీ పోషించారు. డబ్బుని వడ్డీకి తిప్పే పాత్ర అది. ఆడవాళ్లంటే అపారమైన గౌరవం ఉంటుంది. ఎప్పుడూ ఆడవాళ్ల గురించి గొప్పగా చెబుతుంటుంది ఆ పాత్ర. అలాంటి పాల బేబీ గన్‌ ఎందుకు పట్టుకున్నాడనేది తెరపైనే చూడాలి అంటున్నారు అలీ.

సినిమా ఆఖరున తనకు షూటింగ్‌ కోసం ఇచ్చిన గన్‌ మోయలేకపోయానని సరదాగా చెప్పారు అలీ.చిత్రీకరణ పూర్తయ్యాక కొన్ని రోజుల వరకూ చేతి నొప్పి తగ్గలేదని కూడా చెప్పారు. అంత బరువైన పాత్రను అనిల్‌ నాకు ఇచ్చారు అంటూ సరదాగా జోకేశారు అలీ. పాల బేబీ అంతలా ప్రేక్షకుల్ని అలరిస్తాడు అని చెప్పారు. మరి ఎంతలా ఆకట్టుకుంటాడో తెలియాలంటే మే 27న సినిమా చూడాల్సిందే.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus