Alia Bhatt Daughter: వైరల్ అవుతున్న అలియాభట్ కూతురు ఫోటో.. తల్లి పోలిక అంటూ?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సౌత్ లో కూడా ఈ హీరోయిన్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తర్వాత ఈ బ్యూటీ సౌత్ లో బిజీ అవుతారని ఫ్యాన్స్ భావించినా అందుకు భిన్నంగా జరిగింది. ప్రస్తుతం అలియా భట్ బాలీవుడ్ సినిమాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే.

అయితే అలియా భట్ కూతురు ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండగా ఆ ఫోటో హాట్ టాపిక్ అవుతోంది. అలియా భట్ కూతురు రాహా ఫోటోను అభిమానులు ఇప్పటివరకు చూడలేదు. అలియా భట్, రణ్ బీర్ కపూర్ కూతురు ఫోటో రివీల్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ పాప పుట్టి ఏడాది పూర్తి కాగా రణ్ బీర్ రాహాను ఎత్తుకున్న ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఒక ఇన్ స్టాగ్రామ్ పేజ్ ఈ ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఆ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రాహా చాలా ముద్దుగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అలియా భట్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉండగా తర్వాత ప్రాజెక్ట్ లతో ఆమె మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలియాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

అలియా భట్ వరుస సినిమా ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. రణ్ బీర్ కపూర్ సైతం యానిమల్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంటానని నమ్మకంతో ఉన్నారు. అలియా భట్ రాబోయే రోజుల్లో ఇతర భాషల్లో సైతం సత్తా చాటుతారేమో చూడాల్సి ఉంది. కథల ఎంపిక విషయంలో అలియా భట్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రాహా అచ్చం తల్లి పోలిక అంటూ మరి కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

 

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus