తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొద్ది కాలంగా స్టార్ హీరోల పుట్టినరోజులు, సూపర్ హిట్ సినిమాల మైల్ స్టోన్ ఇయర్స్, ఇతర అకేషన్స్ సందర్భంగా ఆయా స్టార్స్ యాక్ట్ చేసిన సూపర్ హిట్ మూవీస్.. లేటెస్ట్ అలాగే ఓల్డ్ ఫిలింస్‌కి 4K, డీటీఎస్ వంటి టెక్నాలజీ యాడ్ చేసి రీ రిలీజ్ అండ్ స్పెషల్ షోస్ వేయడం అనేది జరుగుతూ వస్తోంది.. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ నటించిన పలు చిత్రాలు రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు దాదాపు సంవత్సరాల తర్వాత తారక్ సినిమా ఒకటి రీ రిలీజ్ కాబోతోంది.. అదే.. ‘ఆంధ్రావాలా’..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి కలయికలో వచ్చిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘సింహాద్రి’ తర్వాత.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన ఫస్ట్ ఫిలిం ‘ఆంధ్రావాలా’.. నితిన్ – రాజమౌళిల ‘సై’ సినిమా నిర్మాత గిరి ప్రొడ్యూస్ చేశారు.. రక్షిత, సంఘవి కథానాయికలు.. పూరి డైరెక్ట్ చేసిన మూవీకి వేరే రైటర్ (కోన వెంకట్) డైలాగ్స్ రాయడం ఇదే మొదటిసారి..ఈ సినిమాకి వచ్చిన హైప్ అంతా ఇంతా కాదసలు..
‘ఆంధ్రావాలా’ ఆడియో ఫంక్షన్ స్వర్గీయ నందమూరి తారక రామారావు స్వగ్రామమైన నిమ్మకూరులో ఏర్పాటు చేయడం.. ప్రత్యేక రైళ్లు, తారక్ హెలికాప్టర్‌లో రావడం, పది లక్షల మంది హాజరవడం, భారీ ర్యాలీ.. అప్పటికీ ఇప్పటికీ ఈ ఫంక్షన్ ఓ చరిత్ర అని చెప్తుంటారు.. కట్ చేస్తే.. 2004 జనవరి 1న భారీ అంచనాలతో ప్రేక్షకాభిమానుల ముందుకు వచ్చిందీ చిత్రం.. మార్నింగ్ షో చూసిన వారంతా భారీ షాక్ తిన్నారు.. పూరి – తారక్ నుండి ఇలాంటి సినిమా అస్సలు ఊహించలేదు అంటూ కంగుతిన్నారు..
ఇన్నేళ్ల తర్వాత రీ రిలీజ్ చేస్తున్నారనగానే మరోసారి షాక్‌కి గురవుతున్నారు.. ‘‘రీ రిలీజ్ అయినా, అవ్వక పోయినా దాదాపు ఇరవయ్యేళ్ల క్రితం మొదటిసారి రిలీజ్ అయినప్పుడు, రిలీజ్‌కి ముందు ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.. తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక థియేటర్స్‌లో రిలీజ్ అయిన సినిమా ఇదే.. ఇప్పటికి కూడా ఆడియో ఫంక్షన్ అంటే గుర్తొచ్చేది ‘ఆంధ్రావాలా’ నే’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మార్చి నెలలో చిత్రం రీ రిలీజ్ కానుంది..