Orange Re-Release: రామ్ చరణ్ మూవీ విషయంలో నాగబాబు నిర్ణయం రైటేనా?

రామ్ చరణ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో జెనీలియా హీరోయిన్ గా తెరకెక్కిన ఆరెంజ్ మూవీ ఏ రేంజ్ డిజాస్టర్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మగధీర బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చరణ్ నటించిన ఈ సినిమా సాధారణ ప్రేక్షకులతో పాటు చరణ్ అభిమానులకు సైతం నచ్చలేదు. ఈ సినిమా వల్ల నాగబాబు ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్టు పలు ఇంటర్వ్యూల ద్వారా వెల్లడైంది. ఈ సినిమా వల్ల ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల నుంచి కోలుకోవడానికి నాగబాబుకు చాలా సమయం పట్టింది.

అయితే ఈ సినిమా రీరిలీజ్ దిశగా అడుగులు పడుతుండటం ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. రీరిలీజ్ చేసినా ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందనే గ్యారంటీ లేదు. కొంతమంది ఆరెంజ్ సినిమా క్లాసిక్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా ఈ సినిమాను చూడలేమనే అభిప్రాయం ఎక్కువమందిలో ఉంది. మరోవైపు ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాల రీరిలీజ్ లకు ఆశించిన స్థాయిలో స్పందన దక్కడం లేదు. పోకిరి, జల్సా సినిమాలు మినహా మిగతా సినిమాలు రీరిలీజ్ అయినా ప్రేక్షకులకు నచ్చడం లేదు.

క్రేజ్ లేని సినిమాలను కూడా రీరిలీజ్ చేయడం వల్ల పెద్ద సినిమాలకు లాభం కంటే నష్టం కలిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. చరణ్ మూవీ విషయంలో నాగబాబు నిర్ణయం రైట్ అనిపించుకోదని కామెంట్లు వినిపిస్తున్నాయి. చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తూనే బుచ్చిబాబు డైరెక్షన్ లో మరో సినిమాలో నటిస్తున్నారు.

చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీకి సంబంధించి తాజాగా అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది. తారక్ నో చెప్పిన కథ చరణ్ కు ఎంతగానో నచ్చడంతో ఈ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయింది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus