Ravi Teja, Sharwanand: మరో ఇంట్రెస్టింగ్ కాంబో.. వర్కౌట్ అయితే సూపరే!

‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత మల్టీస్టారర్ల హవా మళ్ళీ పెరుగుతుందనే చెప్పాలి. కాకపోతే ఇద్దరు స్టార్లు కలిసి చేస్తేనే ప్రాజెక్టు పై హైప్ ఏర్పడుతుంది. లేదంటే జుజుబీ అన్నట్టే జనాలు భావిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ లో చిరంజీవి – రవితేజ కలిసి నటించారు. చిరు తమ్ముడి పాత్రలో రవితేజ పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. వీరి కాంబోలో వచ్చిన సన్నివేశాలు కూడా ఇద్దరి అభిమానులను అలరించాయి. రవితేజ కూడా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో సైలెంట్ గా రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరినట్టు అయ్యింది.

అందుకే ఇప్పుడు మరో మల్టీస్టారర్ మూవీలో కలిసి నటించడానికి రెడీ అవుతున్నాడట. ‘వాల్తేరు వీరయ్య’ లో రవితేజ (Ravi Teja) నటించినా అది పక్కా చిరంజీవి మార్క్ సినిమాగానే హైలెట్ అయ్యింది. కాకపోతే ఈసారి తన కంటే కొంచెం తక్కువ ఇమేజ్ ఉన్న హీరోతో రవితేజ కలిసి మల్టీస్టారర్ చేయడానికి రెడీ అయినట్టు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు శర్వానంద్. ఓ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్.. ఈ ఇద్దరు హీరోలకు కథ చెప్పాడట.

అది ఇద్దరికీ నచ్చింది. ఐడియా కూడా కొత్తగా ఉండటంతో .. ఇద్దరూ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయినట్లు తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ప్రాజెక్టు సెట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే రవితేజ నటించిన ‘రావణాసుర’ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మరోపక్క శర్వానంద్ .. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus