ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో విదేశీ ఓటీటీ సంస్థలకు భారీ స్థాయిలో డిమాండ్ పెరిగింది. ఇక కరోనా వచ్చిన అనంతరం భవిష్యత్తులో డిజిటల్ వరల్డ్ లో మార్కెట్ మరింత పెరగనున్నట్లు గ్రహించిన కొందరు లోకల్ వాళ్ళు ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఓటీటీ సంస్థలను భరిగానే లాంచ్ చేశారు. కానీ అందులో చాలా వరకు ఇంకా సరిగ్గా క్లిక్కవ్వడం లేదు. ఇక తెలుగులో లోకల్ గా ఉండాలని ఆహా చేసిన ప్రయత్నాలు మొత్తానికి సక్సెస్ అయ్యాయి.
కేవలం సినిమాలు, వెబ్ కంటెంట్ మాత్రమే కాకుండా ఈ రూట్లో వచ్చిన టాక్ షోలకు కూడా భారీగా స్పందన రావడంతో సంస్థలో భాగస్వామి అయినటువంటి అల్లు అరవింద్ మరిన్ని ప్రణాళికలు రూప కల్పన చేశారు. ముఖ్యంగా అన్ స్థాపబుల్ సెట్స్ పైకి రావడానికి ఆయన చాలానే కృషి చేశారు. నందమూరి బాలకృష్ణతో మొదలు పెట్టిన ఆ టాక్ షోలో అగ్ర తారలు దర్శకులు చాలా ఓపెన్ గా సందడిగా కనిపించారు.
ఇక ఆహా ఖ్యాతిని మిగతా భాషల్లో కూడా పెంచే విధంగా అల్లు అరవింద్ మరో ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. ముందుగా తమిళంలో ఆహా ఖ్యాతి పెరిగేలా బ్యాక్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఇక అందులో కూడా అన్ స్థాపబుల్ లాంటి షోతోనే జనాలను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. పూర్తిగా తమిళంలో ఉండేలా అక్కడి జనాలను ఆకట్టుకునే కంటెంట్ తోనే రాబోతున్నారట. అయితే తమిళ ఇండస్ట్రీలో ఎదురయ్యే సమస్య ఏమిటంటే..
అక్కడి వాళ్ళు ఇక్కడికి వస్తే తప్పుండదు గాని.. ఇక్కడి వాళ్ళు అక్కడికి వెళితే మాత్రం లోకల్ సెంటిమెంట్ గట్టిగానే గుర్తొస్తుంది. అందుకే అల్లు అరవింద్ తెలివిగా అక్కడ ఉండే బడా నిర్మాతను , సీనియర్ హీరోను భాగస్వామిగా చేసుకొని ఆహా ప్రస్థానంను స్టార్ట్ చేయాలని చేస్తున్నారు. అలాగే మిగతా భాషల్లో కూడా ఆహా బ్రాండ్ ను పెంచాలని ఆలోచిస్తున్న అల్లు అరవింద్ ఎంత స్పీడ్ గా డెవలప్ చేస్తారో చూడాలి.