Allu Arjun: పుష్ప2 విషయంలో బన్నీ ప్లాన్ ఇదే!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో నిదానంగా సినిమాలను తెరకెక్కించే దర్శకుడిగా సుకుమార్ కు పేరుంది. సుకుమార్ సినిమాలకు రిలీజయ్యే ముందురోజు వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతాయి. పుష్ప ది రైజ్ వేర్వేరు కారణాల వల్ల మలయాళంలో ఒకరోజు ఆలస్యంగా ప్రదర్శితమైన సంగతి తెలిసిందే. అయితే పుష్ప ది రూల్ షూటింగ్ మాత్రం వేగంగా పూర్తయ్యేలా బన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పుష్ప పార్ట్1 సమయంలోనే సుకుమార్ పార్ట్ 2కు సంబంధించిన కొన్ని సన్నివేశాల షూటింగ్ ను పూర్తి చేశారు.

ఫిబ్రవరి నుంచి బన్నీ ఈ సినిమాకు డేట్లు కేటాయించనున్నారు. 100 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని బన్నీ సుకుమార్ కు సూచించారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పుష్ప ది రూల్ స్క్రిప్ట్ పనులు పూర్తైనా సుకుమార్ పార్ట్1 టాక్ ను దృష్టిలో పెట్టుకుని కొన్ని సీన్లలో మార్పులు చేశారని సమాచారం. పుష్ప పార్ట్ 1కు పాజిటివ్ టాక్ రాకపోయినా కలెక్షన్లు మాత్రం ఊహించని స్థాయిలో వస్తున్నాయి.

పుష్ప పార్ట్2లో ఫహద్ ఫాజిల్ పాత్ర కీలకమనే సంగతి తెలిసిందే. పార్ట్2లో రా సీన్లు ఉండేలా సుకుమార్ జాగ్రత్త పడుతున్నారని బోగట్టా. సుకుమార్ బన్నీ రష్మిక కాంబో సీన్ల గురించి వర్క్ చేస్తున్నారని పార్ట్ 2లో మదర్ సెంటిమెంట్ తక్కువగా ఉండే విధంగా కథలో మార్పులు చేశారని సమాచారం. బన్నీ రష్మికల ట్రాక్ గురించి కూడా సుకుమార్ వర్క్ చేస్తున్నారని సమాచారం. పుష్ప పార్ట్2కు యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చేలా సుకుమార్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వచ్చే ఏడాది దసరాకు పుష్ప పార్ట్2ను రిలీజ్ చేయాలని బన్నీ భావిస్తున్నారు. ఆ కారణం వల్లే ఈ సినిమా షూటింగ్ వేగంగా పూర్తయ్యే విధంగా బన్నీ జాగ్రత్త పడుతున్నారు. ఫహద్ ఫాజిల్ ఇచ్చే డేట్లను బట్టి సుకుమార్ ఈ సినిమా షూటింగ్ ను ప్లాన్ చేయనున్నారు. పుష్ప ది రూల్ కు పుష్పరాజ్ ఫ్లాష్ బ్యాక్ హైలెట్ గా నిలుస్తుందని సమాచారం.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus