అల్లు అర్జున్ (Allu Arjun) కొన్నాళ్లుగా ఏది మాట్లాడినా సంచలనమే..! మరి అది అతని ఉద్దేశపూర్వకంగా జరుగుతుందో లేక యాదృచ్చికంగా జరుగుతుందో.. అనేది ఎవరికీ ఒక క్లారిటీ. బన్నీ ఒక స్టార్ హీరో.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కూడా.! సో ఏదో ఒకటి మాట్లాడి వార్తల్లో ఉండాల్సిన అవసరం బన్నీకి లేదు. చాలా హుందాగా ఉండొచ్చు. కానీ వార్తల్లో ఉండటం, ఫ్రీగా పబ్లిసిటీ చేయించుకోవడం బన్నీకి ఇష్టమనుకుంట. అందుకే ట్రోలర్స్ కి పనిచెబుతూ ఉంటాడు.
Allu Arjun
తాజాగా మరోసారి అదే ఫార్ములాని ఫాలో అయ్యాడు. విషయం ఏంటి అంటే.. నిన్న పుష్ప 2 ఈవెంట్ ఒకటి తమిళనాడులో జరిగింది. ఈ ఈవెంట్లో బన్నీ స్పీచ్ హాట్ టాపిక్ అయ్యింది. తమిళ జనాలని ఆకట్టుకోవడానికి ఎక్కువగా తమిళంలో స్పీచ్ ఇచ్చాడు బన్నీ. చిన్నతనం అంతా చెన్నైలోనే గడవడం వల్ల తమిళం బాగా వచ్చు అని, మనం ఎక్కడికి వెళ్తే అక్కడి నేలకి రెస్పెక్ట్ ఇవ్వాలని బన్నీ చెప్పాడు.
అలాగే తను రజనీకాంత్ (Rajinikanth) సినిమాల కోసం క్యూ లో నిలబడి టికెట్లు కొన్న రోజులు కూడా గుర్తు చేసుకున్నాడు. అయితే చివర్లో తనని స్టేజీపై డాన్స్ చేయమని ఫ్యాన్స్ అడిగితే చేయకుండా ‘ నా డాన్స్ చూడాలంటే టికెట్ కొనుక్కుని థియేటర్లలో చూడాలని చెపుతాను.. కానీ మీకోసం మొదటిసారి స్టేజీపై డాన్స్ చేస్తాను’ అని చెప్పి చిన్న స్టెప్ వేశాడు. అయితే బన్నీ గతంలో తనకి తానుగా చెప్పి మరీ స్టేజీపై డాన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
సరైనోడు సక్సెస్ మీట్ లో ‘నాకెందుకో ఇప్పుడు ఒక స్టెప్ వేయాలని ఉంది’ అంటూ డాన్స్ చేశాడు బన్నీ. దానికి ఒక రేంజ్లో ట్రోల్స్ వచ్చాయి. అలాగే ఒక అవార్డు ఫంక్షన్ లో కూడా ప్రభుదేవాతో కలిసి డాన్స్ చేశాడు. అది కూడా తానే కోరుకుని మరీ చేశాడు. అలా తనే డాన్స్ చెప్పి మరీ చేస్తున్నప్పుడు నిన్న టికెట్ కొనుక్కుని చూడాలి వంటి డైలాగ్స్ ఎందుకో మరి.