ఏంటి..! అల్లు అర్జున్ (Allu Arjun), కమల్ హాసన్ (Kamal Haasan) కాంబినేషన్లో సినిమా వచ్చిందా? వినడానికి విడ్డూరంగా అనిపించినా ఇది నిజం. కమల్ హాసన్- అల్లు అర్జున్ కాంబినేషన్లో ఒక సినిమా వచ్చింది. కానీ చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు. ఇప్పుడు అల్లు అర్జున్ ఇండియాలోనే పెద్ద పాన్ ఇండియా స్టార్. ఇక కమల్ హాసన్ యూనివర్సల్ హీరో. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వచ్చింది? అంటే.. మనం 1986 కి వెళ్ళాలి.
ఆ ఏడాది కమల్ హాసన్ హీరోగా కాశీ విశ్వనాథ్ (K. Vishwanath) గారి దర్శకత్వంలో ‘స్వాతి ముత్యం’ అనే సినిమా వచ్చింది. కమల్ హాసన్ నటించిన ఈ స్ట్రైట్ తెలుగు మూవీ ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.ఇది ఓ క్లాసిక్ అని అంతా చెప్పుకుంటారు. ఈ సినిమాలో కమల్ హాసన్.. శివయ్య అనే మందబుద్ధి కలిగిన యువకుడి పాత్రలో నటించాడు. భర్త చనిపోయిన విధవరాలు ప్రేమించి పెళ్లి చేసుకునే యువకుడిగా కూడా ఇతను కనిపిస్తాడు.
సినిమాలో మొత్తం 3 రకాల షేడ్స్ కలిగిన పాత్రని అవలీలగా పోషించారు కమల్ హాసన్. ఇక సినిమా స్టార్టింగ్లో వయసు మీద పడ్డ వృద్ధుడి పాత్రలో కమల్ హాసన్ కనిపిస్తారు. అతన్ని చూడడానికి విదేశాల నుండి మనవళ్లు, మనవరాళ్లు వస్తారు.ఈ మనవళ్ల గ్యాంగ్లో అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపిస్తాడు. పెద్దగా అతని పాత్రకి డైలాగులు ఏమీ ఉండవు.ఈ సినిమాలో నటించే టైంకి అల్లు అర్జున్ వయసు 4 ఏళ్లు మాత్రమే.
దీనికంటే ముందు చిరంజీవి (Chiranjeevi) ‘విజేత’ (Vijetha) సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఇలా తన చిన్నతనంలోనే కమల్ హాసన్, చిరంజీవి వంటి లెజెండ్స్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్టాన్ని అతను దక్కించుకున్నాడు. ఇక నేటితో ‘స్వాతిముత్యం’ రిలీజ్ అయ్యి 39 ఏళ్లు పూర్తి కావస్తోంది.