ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఓ ప్రధాన ఆయుధం. ప్రజలను ముఖ్యంగా యువతను ప్రభావితం చేసే ముఖ్య సాధనం. స్మార్ట్ ఫోన్ మరియు ఇంటర్నెట్ అభివృద్ధితో ఇప్పుడు ప్రతిఒక్కరు సోషల్ మీడియా మాధ్యమాలైన ట్విట్టర్, పేస్ బుక్, ఇంస్టాగ్రామ్, యూ ట్యూబ్ వంటివి వాడుతున్నారు. రాజకీయ వేత్తలు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ భావాలు పంచుకుంటున్నారు. ఇక సినీతారలకు ఇది చాల అవసరం. తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ పంచుకోవడానికి, అలాగే వ్యక్తిగత విషయాలు, కార్యక్రమాలు, అభిప్రాయాలు అభిమానులతో పంచుకోవడానికి సోషల్ మీడియా ఉపయోగిస్తున్నారు.
కాగా సోషల్ మీడియాలో వారికి ఉన్న ఫాలోవర్స్ ని బట్టి ఆ హరోల రేంజ్ అంచనా వేస్తుంటారు. టాలీవుడ్ నుండి స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్న అల్లు అర్జున్ ట్విట్టర్ లో 4 మిలియన్ ఫాలోవర్స్ కి చేరాడు. గతంలో ఆయన ఫాలోవర్స్ సంఖ్య 3.8 మిలియన్స్ గా ఉండగా అది 4 మిలియన్స్ కి చేరింది. ఈ విషయంలో మహేష్ 8 మిలియన్ ఫాలోవర్స్ తో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. మహేష్ తరువాత స్థానం బన్నీ ఆక్రమించడం విశేషం.
పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 3.9 మిలియన్స్ కి చేరింది. ఆయన కూడా త్వరలో 4 మిలియన్స్ కి చేరువ కానున్నాడు. ఇక మరో స్టార్ హీరో ఎన్టీఆర్ ని ట్విట్టర్ లో 3.6 మిలియన్స్ ఫాలో అవుతున్నారు. ఈ విషయంలో బన్నీ.. పవన్ మరియు ఎన్టీఆర్ లను అధిగమించాడు. ఇటీవలే ట్విట్టర్ ఎంట్రీ ఇచ్చిన చిరు, చరణ్ ల ఫాలోవర్స్ సంఖ్య వేగంగా పెరుగుతుంది. మరో స్టార్ హీరో ప్రభాస్ కి అధికారిక ట్విట్టర్ అకౌంట్ లేదు.