Allu Arjun: సౌత్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్న బన్నీ?

సౌత్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలుగా కొనసాగుతూ ఉన్నారు. ఇలా తెలుగులో మెగాస్టార్ తమిళంలో రజనీకాంత్ ఇలా ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోలు ఉన్నారు. ఇలా స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరూ కూడా దాదాపు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయినటువంటి రజనీకాంత్ మాత్రం ఇప్పటివరకు నూట ముప్పై కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తుంది. ఇలా రజినీకాంత్ ఒక్క సినిమాకు 130 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకు సౌత్ ఇండస్ట్రీలోని అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి హీరోగా పేరు పొందారు.

అయితే ఈ రికార్డును అల్లు అర్జున్ (Allu Arjun) బద్దలు కొట్టారని తెలుస్తుంది. ప్రస్తుతం రజనీకాంత్ కు మించి అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారని తెలుస్తుంది. పుష్ప సినిమాతో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి.

ఈ సినిమా కోసం అల్లు అర్జున్ తీసుకొనే రెమ్యూనరేషన్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ తో పాటు సినిమాలో లాభాలలో 30% వాటా తీసుకోబోతున్నారని తెలుస్తుంది. ఈ విధంగా పుష్ప సీక్వెల్ సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా 150 కోట్ల వరకు తీసుకోబోతున్నారని తెలుస్తుంది.

ఇలా ఇప్పటివరకు రెమ్యూనరేషన్ విషయంలో టాప్ లో ఉన్న రజినీకాంత్ ను ఆల్లు అర్జున్ బీట్ చేశారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ తదుపరి సినిమా చేయబోతున్నారు. ఈయన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus