Allu Arjun, Samantha: ‘పుష్ప’కు మరో ఎట్రాక్షన్..!

టాలీవుడ్ పెద్ద సినిమాలకు డాన్స్ కొరియోగ్రఫీ అంటే జానీ మాస్టర్ లేదంటే శేఖర్ మాస్టర్ లను తీసుకుంటూ ఉంటారు. వీరిద్దరూ కూడా తమ కొరియోగ్రఫీతో ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ముందుగా జానీ మాస్టర్ ను కొరియోగ్రఫీ చేయమని అడగలనుకున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం బాలీవుడ్ నుంచి కొరియోగ్రాఫర్ ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా కొరియోగ్రాఫర్ గా టాప్ రేసులో దూసుకుపోతున్నారు గణేష్ ఆచార్య మాస్టర్.

గతంలో ‘డీజే’ సినిమాలో ‘గుడిలో బడిలో’ అనే సాంగ్ కి కొరియోగ్రఫీ చేశారాయన. అందుకే బన్నీ మరోసారి అతడితో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో అల్లు అర్జున్, సమంత డాన్స్ స్టెప్స్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక దానికి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ కాబట్టి ఇండస్ట్రీలో టాప్ ఐటమ్ సాంగ్స్ లో ఇది కూడా చేరిపోవడం ఖాయం. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.

ఈ సాంగ్ కోసం స్పెషల్ గా సెట్ ను కూడా నిర్మించారు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను డిసెంబర్ 17న అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus