Pushpa Movie: ఫ్యాన్స్ కామెంట్లపై సుకుమార్ స్పందిస్తారా?

స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ థియేటర్లో విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అల వైకుంఠపురములో సినిమా తర్వాత బన్నీ నటించిన పుష్పతో బన్నీ ఖాతాలో మరో హిట్ చేరింది. బన్నీ, సుకుమార్ హ్యాట్రిక్ మూవీ అయిన పుష్ప ది రైజ్ కు బ్లాక్ బస్టర్ టాక్ రాకపోయినా హిట్ టాక్ వచ్చింది. బన్నీ అభినయానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఊర మాస్ లుక్ లో పుష్పరాజ్ పాత్రలో బన్నీ తన నటనతో మెప్పించారు.

రంగస్థలం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని సుకుమార్ తెరకెక్కించిన పుష్ప ది రైజ్ సినిమాలో నటీనటులంతా తమ బెస్ట్ ఇచ్చారు. బన్నీ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అయితే ఈ సినిమా నిడివి విషయంలో నెటిజన్ల నుంచి, బన్నీ ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. పుష్ప ది రైజ్ బన్నీ వన్ మ్యాన్ షో కాగా మాస్ ప్రేక్షకులతో విజిల్స్ వేయించేలా సమంత ఐటం సాంగ్ ఉంది.

సినిమాలో కొన్ని అనవసర సన్నివేశాలను తొలగిస్తే బాగుంటుందని బన్నీ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్న నేపథ్యంలో సుకుమార్ పుష్ప నిడివి తగ్గించే దిశగా అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది. ప్రథమార్థం బాగున్నా సెకండాఫ్ లో బోరింగ్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. సినిమా నిడివి తగ్గి ఉంటే పుష్ప ది రైజ్ తగ్గేదేలే అనే విధంగా ఉండేదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేరళలో ఈ సినిమా వాయిదా పడటం బన్నీ అభిమానులకు నిరాశను మిగిల్చింది.

టెక్నికల్ రీజన్స్ వల్ల ఫైనల్ ప్రింట్ రావడానికి ఆలస్యమైందని సమాచారం. పుష్ప ది రైజ్ గురించి పాజిటివ్ గా స్పందిస్తూ ట్వీట్లు పెడుతున్నారు. సినిమాలో సమంత తన నాటు పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. బన్నీ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు ఫ్యామిలీతో విచ్చేసి సందడి చేశారు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus