స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ చిత్రంతో బన్నీ-త్రివిక్రమ్.. హ్యాట్రిక్ కొట్టారు. ఈ చిత్రం బన్నీ కెరీర్లో పెద్ద హిట్ గా నిలవడమే కాదు.. నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచింది.టి.ఆర్.పి విషయంలో కూడా ఆల్ టైం రికార్డ్ కొట్టింది.ఇక అలాగే బుట్ట బొమ్మ లాంటి పాటలు మిలియన్ల కొద్దీ వ్యూస్ ను నమోదు చేస్తూనే ఉన్నాయి. ఇక ఈ చిత్రం విడుదలై ఈరోజుతో ఏడాది పూర్తికావస్తున్న తరుణంలో ‘అల’ టీమ్ సెలబ్రేషన్స్ కోసం నిన్న రీయూనియన్ అయ్యింది.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ స్పీచ్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యిందనే చెప్పాలి. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. “2020 ప్రపంచం మొత్తానికి చాలా బ్యాడ్ ఇయర్. కానీ నేను మాత్రం 2020 గురించి కంప్లైంట్ చెయ్యను. ఎందుకంటే నాకు 2020 బాగా కలిసొచ్చింది. నా మనసులో ఎప్పటినుండో ఉన్న కోరిక ఈ సంవత్సరంలో నెరవేరింది.అదేంటంటే.. చాలా మంది హీరోలు వారి కెరీర్ ప్రారంభంలోనే ఆల్‌టైమ్ హిట్ కొట్టారు. కళ్యాణ్ గారు ’ఖుషీ’తో ఆల్‌టైమ్ హిట్ కొట్టారు.
తారక్ కి ‘సింహాద్రి’తో దొరికింది, చరణ్ కు రెండో సినిమా ‘మగధీర’తోనే దొరికింది. నాకు అలాంటి హిట్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తే..ఏకంగా 17 ఏళ్ల వరకూ టైం పట్టింది. అవును 2020లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం నా కోరికను తీర్చింది. ఈ చిత్రానికి పనిచేసిన వాళ్లందరికీ పెద్ద థాంక్స్” అంటూ చెప్పుకొచ్చాడు.