Allu Arjun, Sukumar: బన్నీ మాటలకు ఏడ్చేసిన సుకుమార్.. వీడియో వైరల్!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కొన్ని చోట్ల ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ పరంగా మాత్రం దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.275 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిందని నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు. తాజాగా ఈ సినిమా థాంక్స్ మీట్ ను నిర్వహించగా.. అందులో బన్నీ తన స్పీచ్ తో ఆకట్టుకున్నాడు.

ముందుగా ‘పుష్ప’ సినిమా ఎలా మొదలైందో చెప్పుకొచ్చాడు బన్నీ. సినిమా కోసం పని చేసిన సాంకేతిక నిపుణులు, ఆర్టిస్ట్ ల గురించి గొప్పగా మాట్లాడారు. ఒక్కొక్కరి గురించి వీడియోలు ప్లే చేసి మరీ చూపించారు. ఇదే సమయంలో సుకుమార్ గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఐకాన్ స్టార్. బన్నీ స్పీచ్ విన్న సుకుమార్ సైతం ఎమోషనల్ అయ్యారు. ”నా జీవితంలో రుణపడి ఉన్నాను అనే పదాన్ని చాలా తక్కువ మందికే వాడతాను.

జన్మనిచ్చిన తల్లితండ్రులకు, మా తాతయ్యకు, నా మొదటి సినిమా నుంచి సపోర్ట్ చేస్తోన్న చిరంజీవి గారికి రుణపడి ఉన్నాను. ఆ తరువాత నేను రుణపడి ఉన్నది సుకుమార్‌కే. నాకు సుకుమార్‌ అంటే అంత ఇష్టమని నాకే తెలియదు. పరుగు సినిమా సమయంలో నేను 85 లక్షలు పెట్టి ఓ కారు కొన్నాను. స్టీరింగ్‌పై చేయివేసి.. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఎవరని ఆలోచించగా…నాకు ఫస్ట్‌ గుర్తొచ్చిన పేరు సుకుమార్‌.

డార్లింగ్‌.. నువ్వు లేక పోతే నేను లేను..” అని బన్నీ అనగానే ఏడ్చేశారు సుకుమార్. బన్నీ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో ‘ఆర్య’, ‘ఆర్య2’ వంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ‘పుష్ప’ పార్ట్ 2కి వీరిద్దరూ కలిసి పని చేయబోతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. దసరా నాటికి సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus