Allu Arjun: అల్లు అర్జున్ ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్!

ఆగస్టు 30 , 31 న దేశవ్యాప్తంగా జనాలంతా రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. అన్నా లేదా తమ్ముడికి రాఖీ కట్టి.. వాళ్ళు కలకాలం సంతోషంగా, సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు సోదరీమణులు.అలాగే అమ్మలో సగం… నాన్నలో సగం అయ్యి తమ చెల్లి లేదా అక్కలను సంతోషంగా ఉండాలని సోదరులు సైతం కోరుకుంటూ వారికి అండగా నిలబడతారు. సామాన్యులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా ఈ రక్షా బంధన్ ను స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈసారి ఆగస్టు 30న కొంతమంది ఈరోజు(ఆగస్టు 31న) ఇంకొంత మంది అసలైన రాఖీ పండుగ అంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

సినిమా వాళ్ళతో పాటు బుల్లితెర సెలబ్రిటీలు కూడా ఈ రాఖీ పండుగని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. పూజా హెగ్డే, శ్రీదేవి విజయ్ కుమార్, నిషా అగర్వాల్ వంటి హీరోయిన్లు తమ సోదరులకు రాఖీ .. తర్వాత తీసుకున్న ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయడం జరిగింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఇంట్లో కూడా రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగినట్లు స్పష్టమవుతుంది.

బన్నీ కూతురు అర్హ .. తన అన్న అయాన్ కి రాఖీ కట్టిన ఫోటోలు , అలాగే అల్లు స్నేహ చెల్లెలి పిల్లలకి కూడా అర్హ రాఖీ కట్టిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు .. అల్లు అర్జున్ తన కజిన్ సిస్టర్ తో కూడా రాఖీ కట్టించుకున్న ఫోటోని కూడా అల్లు స్నేహ షేర్ చేయడం విశేషం.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus