Pushpa Story: కటౌట్లు పెరికేసిన బన్నీ ఫ్యాన్స్.. బాలేదంటూ?

స్టార్ హీరో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ తర్వాత నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప ది రైజ్ ఆ సినిమాను మించి సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావించారు. పుష్ప మూవీ బాగానే ఉన్నా ప్రేక్షకుల అంచనాలను మించి మాత్రం ఈ సినిమా హిట్ కాలేదు. కొంతమంది బన్నీ అభిమానులకు కూడా ఈ సినిమా నచ్చలేదు. రంగస్థలం దర్శకుడు సుకుమార్ నుంచి ఆశించిన స్థాయిలో పుష్ప లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

క్రిటిక్స్ పుష్ప ఫస్టాఫ్ బాగుందని సెకండాఫ్ ఆశించిన స్థాయిలో లేదని చెబుతుండగా ప్రేక్షకులు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సుకుమార్ పాత్రల గెటప్ లపై బాగానే శ్రద్ధ పెట్టారని కథ, కథనాల విషయంలో మాత్రం శ్రద్ధ పెట్టలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే పుష్ప మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా లేదని కర్నూలు జిల్లా నంద్యాలలో ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు. నంద్యాలలో ఉన్న ప్రతాప్ థియేటర్ బయట బన్నీ అభిమానులు కటౌట్లను పెరికివేసి అగ్రహం వ్యక్తం చేశారు.

తమ అంచనాలు ఒక విధంగా ఉంటే సినిమా మరో విధంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేశారు. బన్నీ తొలి పాన్ ఇండియా మూవీ నిరాశ పరుస్తుందని అనుకోలేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం పుష్ప మూవీ విషయంలో కఠినంగా వ్యవహరించింది. బెనిఫిట్ షోలు, అదనపు షోల విషయంలో మల్టీప్లెక్స్ లలో సైతం నియంత్రణ కొనసాగింది. పుష్ప సినిమా రిలీజ్ సమయంలోనే థియేటర్ల ఓనర్లు కోర్టు మెట్లు ఎక్కడంతో ప్రభుత్వం ఈ సినిమా విషయంలో మరింత కఠినంగా వ్యవహరించిందని సమాచారం.

బాలయ్య సినిమాకు లేని రిస్ట్రిక్షన్స్ బన్నీ సినిమాకు అమలు కావడంతో ఫ్యాన్స్ సైతం షాకయ్యారు. 180 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాకు 141 కోట్ల రూపాయల బిజినెస్ జరగగా కనీసం 150 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తే ఈ సినిమా హిట్ అనిపించుకుంటుంది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus