Allu Arjun: పుష్ప 2 కోసం థమన్ రావాలి!

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప మొదటి రోజు భారీగానే ఓపెనింగ్స్ అందుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా దర్శకుడు సుకుమార్ హీరో అల్లు అర్జున్ చేసిన మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఓ వర్గం ప్రేక్షకులను అయితే బాగానే ఆకట్టుకుంది. అయితే సినిమాలో అందరి కంటే ఎక్కువగా అల్లుఅర్జున్ పనితనం పర్ఫెక్ట్ గా కనిపించినట్లు పాజిటివ్ కామెంట్స్ అయితే వెలువడుతున్నాయి. ఇక నెగటివ్ కామెంట్స్ అయితే ఎక్కువగా దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై ప్రేక్షకులు విమర్శలు చేస్తున్నారు.

ఇక ఇటీవల కాలంలో వరుస సినిమాలతో తమన్ మంచి విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అఖండ సినిమాకు తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. అందుకోసమే ప్రస్తుతం ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్పెషలిస్ట్ గా తమన్ మారినట్లు చెప్పుకుంటున్నారు. అయితే పుష్ప మొదటి భాగానికి దేవిశ్రీప్రసాద్ సరైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వకపోవడంతో అసంతృప్తి చెందుతున్న అల్లు అర్జున్ అభిమానులు రెండవ భాగానికి తమన్ రావాల్సిందే అని సోషల్ మీడియాలో ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.

అఖండ సినిమాతో ఒక్కసారిగా తన స్థాయిని పెంచుకున్న తమన్ ఈ సినిమాకు కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తే సరైన న్యాయం చేయగలరు అని చాలా మంది అభిమానుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక విధంగా పుష్ప సినిమా హడావిడిలో తమన్ పేరు వైరల్ అవ్వడం విశేషం. తమన్ ఎలాంటి సినిమా చేసినా కూడా మ్యూజిక్ విషయంలో పొరపాట్లు చేసినప్పటికీ కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అసలు పొరపాట్లు చేయడని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే అందుకున్నాడు.

కానీ పుష్ప సినిమా విషయంలో దేవిశ్రీ ప్రసాద్ ఊహించని విధంగా పొరపాట్లు చేసినట్లు చెప్పుకుంటున్నారు. అయితే సుకుమార్ మాత్రం దేవిశ్రీప్రసాద్ నీ మాత్రమే మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకోవడానికి ఇష్టపడతాడు అని అందరికీ తెలిసిన విషయమే. మరి పుష్ప సెకండ్ పార్ట్ లో అయినా డిఎస్పి తన మ్యూజిక్ తో అభిమానుల అంచనాలను అందుకుంటాడో లేదో చూడాలి.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus