టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు…దాదాపుగా ఎన్నో ఏళ్లు మెగాస్టార్ చిరు టాప్ హీరోగా ఇండస్ట్రీలో మంచి ప్రూ సంపాదించుకోవడమే కాకుండా స్వయంకృషితో పైకి వచ్చారు. ఇక ఆయన అభిమానులు సైతం ఆయన స్వయంకృషికి ఎల్లప్పుడూ దాసోహం అంటూనే ఉంటారు…ఇదిలా ఉంటే చిరు కరియర్ లో ఆయన చేసిన ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో మాస్ పాత్రలు ఉన్నాయి…క్లాస్ పాత్రలు ఉన్నాయి…కానీ ఎక్కువ శాతం మాస్ సినిమాలే చేసిన చిరు మాస్ ఫ్యాన్ బేస్ ను ఎక్కువగా ఏర్పరుచుకోవడంతో గ్రాండ్ సక్సెస్ సాధించారనే చెప్పాలి…అదే క్రమంలో అప్పట్లో చిరు ముగ్గురు మొనగాళ్లు మూవీలో ఒక బ్రాహ్మణుడి పాత్రను కూడా పోషించారు.
ఆ సినిమాలో చిరంజీవి మూడు రోల్స్ చేస్తే.. అందులో ఒకటి దత్తాత్రేయ. ఆ పాత్రలో రమ్యకృష్ణ తో కలసి చిరు ఆడి పాడిన తీరు….అబ్బా సూపరో సూపర్ అనే చెప్పాలి…అయితే అలాంటి బ్రాహ్మణుడి పాత్ర ఇప్పటివరకూ మెగా ఫ్యామిలీలో ఎవ్వరూ చెయ్యడానికి సాహసించలేదు…అయితే చిరు తర్వాత నేనే అంటున్నాడు మన అల్లు వారి వారసుడు….స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్…విషయంలోకి వెళితే….హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న డీజే-దువ్వాడ జగన్నాధంలో బన్నీ రోల్ సరికొత్తగా ఉండబోతుంది అని అందరికే తెలిసిందే…అయితే ఈ సినిమాలోనే బన్నీ బ్రహ్మణుడి పాత్రలో నటించి మెప్పించనున్నాడు మామయ్య చిరు తర్వాత మళ్లీ ఆ పాత్ర తానే చేస్తుండడంతో.. కచ్చితంగా కంపేరిజన్ ఉంటుందనే ఉద్దేశ్యంతో చాలానే జాగ్రత్తలు తీసుకున్నాడట. మరి బన్నీ ఈ పాత్రలో ఎలాంటి నటనని కనబరుస్తాడో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.