ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటుడిగా ప్రతి సినిమాకు తనని తాను అద్భుతంగా మలుచుకున్నటువంటి తీరు ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టింది అయితే అల్లు అర్జున్ సినీ కెరియర్ లో నటించిన సినిమాలలో కొన్ని ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. ఇక ఇండస్ట్రీలో ఉండే ఏ సెలబ్రిటీ అయినా కూడా తమ సినిమాలో హిట్ కావాలని కోరుకుంటారు.
కానీ అల్లు అర్జున్ మాత్రం ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసినా కూడా ఒక సినిమాలో నటించారు అనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. డైరెక్టర్ వక్కంతం వంశీ అల్లు అర్జున్ వద్దకు వెళ్లి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా కథ వినిపించారట అయితే ఈ సినిమా కథ విన్నటువంటి అల్లు అర్జున్ ఈ సినిమా చేస్తే ఖచ్చితంగా డిజాస్టర్ అవుతుందని ఊహించారట. సాధారణంగా అల్లు అర్జున్ సినిమా అంటే ప్రేక్షకులు ఆ సినిమా చాలా సరదాగా ఉంటుందని భావిస్తారు
అయితే ఇప్పటివరకు ఈయన మెసేజ్ ఇచ్చే సినిమాలలో నటించలేదు ఇలాంటి సినిమాలలో నటిస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేరు అనే విషయం అల్లు అర్జున్ కి తెలిసినప్పటికీ తన సినీ కెరియర్లో ఒకటైన దేశభక్తి సినిమా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈయన ఈ సినిమాలో నటించారట. ఇలా అనుకున్న విధంగానే అల్లు అర్జున్ ఈ సినిమాలో నటించడం ఈ సినిమా ఫ్లాప్ అవ్వటం కూడా జరిగింది. ఈ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత అల్లు అర్జున్ ఊహించిన విధంగానే ఈ సినిమా ఫ్లాప్ అయింది అనే విషయం తెలియడంతో బన్నీ అభిమానులు అల్లు అర్జున్ పై ఫైర్ అయ్యారట
సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసి కూడా సినిమా చేయడం ఏంటి అంటూ అప్పట్లో (Allu Arjun) అల్లు అర్జున్ తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తుంది. ఇలా అల్లు అర్జున్ కి సంబంధించిన ఈ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక బన్నీ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే పుష్ప సీక్వెల్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమాతో ఈయన బిజీ కానున్నారు.
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!