Allu Arjun: ‘పుష్ప 2’ నుండి ఈ రేంజ్ మాస్ లుక్ ను ఊహించి ఉండరు.. ఫోటో వైరల్!

‘పుష్ప’ అనే టైటిల్ పెట్టుకోవడమే అల్లు అర్జున్ చేసిన పెద్ద సాహసం. పైగా సినిమాలో అల్లు అర్జున్ పేరు పుష్ప రాజ్. ఓ స్టార్ హీరో సినిమాకి ఇలాంటి టైటిల్, సినిమాలో ఆ స్టార్ హీరో పాత్రకు ఇలాంటి పేరు పెట్టుకోవడం అంటే ట్రోలింగ్ రాయుళ్లకు పెద్ద ఛాన్స్ ఇచ్చినట్టే..! అల్లు అర్జున్ దమ్మున్న టాలీవుడ్ హీరో అని దీనిని బట్టి ప్రూవ్ అయ్యింది. దర్శకుడు సుకుమార్ పై అల్లు అర్జున్ పెట్టుకున్న నమ్మకం ఎంత మాత్రం తప్పు కాలేదు.

అయితే ‘పుష్ప 2’ లో అంతకు మించిన రిస్క్ చేయబోతున్నాడు అల్లు అర్జున్. అందుకు కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియోని బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. అంతేకాదు ‘పుష్ప 2’ నుండి అల్లు అర్జున్ మాస్ లుక్ కు సంబంధించిన ఓ పోస్టర్ కూడా ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది.ఈ పోస్టర్ ను అధికారికంగా చిత్ర బృందం రివీల్ చేయలేదు. అప్పుడు ఇలాంటి లుక్ సినిమాలో ఉండదు అని అభిమానులు సంతోషించడానికి లేదు.

అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ఈ పోస్టర్ లో కనిపిస్తున్న లుక్ సినిమాలో ఉంటుందట. అయితే చాలా డీగ్రేడింగ్ గా ఉన్న ఈ లుక్ ను అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారా అనే ఉద్దేశంతో చిత్ర బృందం ముందుగా లీక్ సుహాసినట్టు తెలుస్తుంది. అమ్మవారి గెటప్ లో చీర కట్టుకుని, నుదుటిపై బొట్టు, చేతిలో గన్ తో అల్లు అర్జున్ ఔట్ ఆఫ్ ది బాక్స్ అనే రా లుక్ లో కనిపిస్తున్నాడు.

ఈ లుక్ లో కనిపించేందుకు కూడా స్టార్ హీరోకి చాలా ధైర్యం కావాలి. (Allu Arjun) బన్నీలో అది పుష్కలంగా ఉంది. ఇక ‘పుష్ప'(ది బిగినింగ్) సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తెలుగులోనే కాకుండా నార్త్ లో కూడా ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు ‘పుష్ప2’ కూడా అక్కడ భారీ కలెక్షన్స్ సాధించే అవకాశాలు లేకపోలేదు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus