టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సోషల్ మీడియాలో మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. మలయాళ ప్రేక్షకులు ఈ స్టార్ హీరోను ప్రేమగా మల్లూ అర్జున్ అని పిలుచుకుంటారు. బాలీవుడ్ ఆడియన్స్ సైతం బన్నీ నటనకు ఫిదా అవుతున్నారు. పుష్ప సిరీస్ సినిమాల కోసం బన్నీ దాదాపుగా ఐదేళ్ల సమయం కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి బాహుబలిని ఏ విధంగా తెరకెక్కించారో సుకుమార్ కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ పుష్ప సిరీస్ సినిమాలను నిదానంగా తీస్తున్నారు.
పుష్ప2 సినిమా 2024 సంవత్సరం ఆగష్టు నెల 15వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఇకపై బన్నీ సినిమాల విషయంలో వేగం పెంచనున్నారు. బన్నీ భవిష్యత్తు ప్రాజెక్ట్ ల గురించి సైతం పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చేసిందనే చెప్పాలి. మూడేళ్లలో నాలుగు సినిమాలు విడుదలయ్యేలా బన్నీ కెరీర్ ప్లానింగ్ ఉందని తెలుస్తోంది. ఒకే సమయంలో రెండు సినిమాలు షూటింగ్ ను జరుపుకునేలా బన్నీ నిర్ణయాలు ఉన్నాయని సమాచారం.
బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో బన్నీ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు తెరకెక్కనున్నాయి. పుష్ప2 సినిమాతో పాటు ఈ మూడు సినిమాలు 2026 సంవత్సరం చివరి నాటికి రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. పుష్ప2 సినిమా బడ్జెట్ హద్దులు దాటుతోందని ప్రచారం జరుగుతుండగా ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటంతో ఎంత ఖర్చు చేసినా రిస్క్ కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
బన్నీ (Allu Arjun) మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండగా పుష్ప2 సినిమాతో బన్నీ మరో ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకోవాలని ఆశిద్దాం. బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటూ ఇతర హీరోలకు షాకిస్తున్నారు. బన్నీ పారితోషికం గురించి కూడా సోషల్ మీడియాలో వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.