అవును అల్లు అర్జున్ సినిమా ఓ స్టార్ హీరో కాన్ఫిడెన్స్ ను బాగా దెబ్బతీసింది. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్లో కొద్దిరోజుల క్రితం వరకు ఎక్కువగా వినిపించిన పేరు కార్తీక్ ఆర్యన్. సొంత టాలెంట్ తో క్రేజ్ సంపాదించుకున్న బాలీవుడ్ హీరోల్లో ఇతను కూడా ఒకడు. చూడ్డానికి చక్కగా ఉంటాడు, మంచి హైట్, నటనతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు.ఇతను నెక్స్ట్ బిగ్ థింగ్ అని అక్కడి జనాలు అనుకున్నారు.కానీ ఊహించని విధంగా ఇతని కెరీర్ స్లో అయ్యింది.
‘దోస్తానా 2’ నుండి ఇతన్ని ‘ధర్మ ప్రొడక్షన్స్’ సంస్థ తీసేసింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా అతను ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ‘రెడ్ చిల్లీస్’ సంస్థ కూడా కార్తీక్ ఆర్యన్ తో ఒప్పందం కుదుర్చుకున్న ప్రాజెక్టుని ఆపేసింది. ఇవన్నీ కార్తీక్ ఆర్యన్ ని ఇబ్బంది పెట్టలేదట. కానీ ఇతను నటించిన ‘షెహజాద’ చిత్రం పెద్ద ప్లాప్ అయ్యింది. (Allu Arjun) అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన ఆల్ టైం సూపర్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి ఇది రీమేక్.
ఈ సినిమా ఫలితం కార్తీక్ ఆర్యన్ ను చాలా ఇబ్బంది పెట్టిందట. దీంతో ఇక జన్మలో రీమేక్ ల జోలికి పోను అంటున్నాడు ఈ కుర్ర హీరో. షెహజాద చిత్రానికి కూడా ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ ‘గీతా ఆర్ట్స్’ సంస్థల పై అల్లు అరవింద్, రాధా కృష్ణ(చినబాబు) నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరించారు.